మోత్కూరు : మోత్కూరు మున్సిపల్ కేంద్రానికి చెందిన బోయిని నర్సింహ, యాకమ్మల కుమారుడు బోయిని రిత్విక్ స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. ఈ వేసవి సెలవుల్లో ఏదో ఒకటి చేయాలనే తపనతో అట్టముక్కలు, సిరంజీలు, గ్లూకోజ్ పైపులు, ట్యాగ్‌ల సాయంతో జేసీబీ యంత్రాన్ని రూపొందించాడు. సిరంజీల్లో నింపిన వాటర్, గ్లూకోజ్ పైపుల ద్వారా హైడ్రాలిక్ మోడల్‌లో జేసీబీ మిషన్‌ను అటు ఇటు తిప్పుతూ, పైకి లేపుతూ ఆపరేట్ చేస్తున్నాడు. చిన్నప్పటి నుంచి తనకు ఎలక్ట్రానిక్ పరికరాలు తయారు చేయడంలో ఎంతో ఆసక్తి ఉందని, గతంలో వైబ్రేషన్ మిషన్, వాటర్ మోటారును తయారు చేసినట్లు చెప్పాడు.


