మిర్యాలగూడ అర్బన్: విద్యుదాఘాతంతో సిలిండర్ పేలి మృతి చెందిన లక్ష్మణ్, ప్రణతిల తల్లి నక్కధనమ్మ శుక్రవారం రాత్రి మిర్యాలగూడకు చేరుకుంది. ఇంటికి వచ్చిన వెంటనే సిలిండర్ పేలుడు ధాటికి కూలిపోయిన ఇంటిని చూసి తన కొడుకు, కూతురును తలుచుకుని కనిపించకుండా పోతిరా బిడ్డలారా అంటూ బోరున విలపించింది. నేను వెళ్లిన నాలుగు రోజులకే ఇలా జరగడం జీర్ణించుకోలేక పోతున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. అక్కడికి చేరుకున్న పోలీసులు ఆమె వివరాలను సేకరించారు. అగ్ని ప్రమాదంపై ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
● కూలిన ఇంటిని చూసి
బోరున విలపించిన తల్లి


