మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డికి తీవ్ర అస్వస్థత | - | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డికి తీవ్ర అస్వస్థత

Jun 6 2026 1:05 AM | Updated on Jun 6 2026 1:05 AM

భువనగిరి (బీబీనగర్‌) : భువనగిరి మాజీ ఎమ్మెల్యే కొమ్మిడి నర్సింహారెడ్డి శుక్రవారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అనారోగ్యం కారణంగా 20 రోజులుగా ఆయన నిమ్స్‌ ఆస్పత్రిలో డైరెక్టర్‌ పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. శుక్రవారం ఒక్కసారిగా ఆయన తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఆయనను మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి పరామర్శించారు. నర్సింహారెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 1972, 1978లో జరిగిన ఎన్నికల్లో నర్సింహారెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

Advertisement
 
Advertisement
Advertisement