సజ్జ
కొర్రలు
ఖరీఫ్ పంటగా కొర్రను జూలై, ఆగస్టు మాసాల్లో విత్తుకోవాలి. కొర్ర పంట 70 నుంచి 85 రోజుల్లో కోతకు వస్తుంది. కొర్రలో ప్రసాద్, కృష్ణదేవరాయ, శ్రీలక్ష్మీ, సూర్యనంది, ఎస్‌ఐఏ 3085, ఎస్‌ఐఏ 3156 రకాలు అనుకూలం. పప్పు శనగకు ముందు 70–75 రోజులలో సూర్యనంది కొర్రలు సాగు చేసి శనగ వేసుకుంటే నికర ఆదాయం పెరుగుతుంది.
ఎరువుల యాజమాన్యం: ఎకరాకు రెండు టన్నుల పశువుల ఎరువు, 8 కిలోల నత్రజని, 17 కిలోల భాస్వరం వేసుకోవాలి. వరి, మొక్కజొన్న పంటలకు బదులుగా తక్కువ నీటి వినియోగంలో ఉన్న చిరుధాన్యాల పంటలు ఎంచుకుంటే తక్కువ పెట్టుబడులతో అదాయాలు పొందవచ్చు.
పెద్దవూర : ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం వలన వర్షాలు తక్కువగా కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. దీంతో అధిక నీటి అవసరం ఉన్న వరి పంటకు ప్రత్యామ్నాయంగా రైతులు చిరు ధాన్యాల పంటలైన జొన్న, సజ్జ, రాగి, కొర్ర పంటలు సాగు చేస్తే తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు, లాభాలు పొందవచ్చని మండల వ్యవసాయ అధికారి సత్యనారాయణ చెబుతున్నారు. చిరుధాన్యాల సాగులో ఎరువుల యాజమాన్యం, సస్యరక్షణ చర్యలపై ఆయన పలు సూచనలు చేశారు.
జొన్న
వానాకాలంలో రాష్ట్రంలో జొన్న పంటను అన్ని జిల్లాలలో సాగు చేయవచ్చు. నల్లరేగడి, తేలికపాటి నేలలు జొన్న పంటకు అనుకూలం. ఖరీఫ్‌లో తొలకరి వర్షాలు కురవగానే వర్షపాతం ఆధారంగా జూన్ మొదటి వారం నుంచి జూలై చివరి వారం వరకు విత్తుకోవాలి. విత్తడం ఆలస్యమైతే కాండం తొలుచే పురుగు ఉధృతి పెరుగుతుంది.
రకాలు: హైబ్రీడ్ రకాలైన సీఎస్‌హెచ్ 14, 16, 18, 21 రకాలతో పాటు ప్రాచుర్యం పొందిన ప్రై వేటు కంపెనీల హైబ్రీడ్ రకాలను సాగు చేయవచ్చు. హైబ్రీడ్ రకాలలో ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు దిగుబడి పొందవచ్చు. సాధారణ రకాలైన సీఎస్‌వీ 15, శ్రీశైల(పీఎస్‌వీ–56) రకాలు సాగు చేయవచ్చు. ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.
విత్తే విధానం: జొన్న సాగుకు ఎకరాకు 3 నుంచి 4 కిలోల విత్తనం వాడుకోవాలి. వరుసల మద్య 45 సెంటీమీటర్లు, మొక్కకు మొక్కకు మద్య 12 నుంచి 15 సెంటీమీటర్ల దూరం ఉండేలా విత్తకోవాలి.
అంతర పంట: జొన్నలో కందిని అంతర పంటగా 2:1 నిష్పత్తిలో సాగు చేసుకోవచ్చు. విత్తిన 42 గంటల్లోపు లీటరు నీటికి 4 గ్రాములు అట్రజిన్ కలుపు మందును కలిపి పిచికారీ చేస్తే మొదటి దశలో వచ్చే కలుపును నివారించవచ్చు. జొన్నలో ఎక్కువ కష్టం కలిగించే మల్లె(కలుపు) నివారణకు లీటర్ నీటికి 50 గ్రాముల అమ్మోనియం సల్ఫేట్ లేదా 2.4–డి సోడియం సాల్ట్ 2 గ్రాములు కలిపి పిచికారీ చేయాలి.
రాగులు
వానా కాలంలో రాగి పంటను జూలై నుంచి ఆగస్టు వరకు విత్తుకోవచ్చు. రాగి పంట 80 నుంచి 115 రోజులలో చేతికి వస్తుంది. స్వల్పకాలిక రకాలైన మారుతి, చంపావతి, 80 నుంచి 90 రోజుల్లో.. మధ్యకాల రకాలైన సప్తగిరి, భారతి, గోదావరి, 100 నుంచి 115 రోజుల్లో, పీపీఆర్ 1012 రకం 115 నుంచి 120 రోజులలో పంట కోతకు వచ్చి ఎకరాకు 12 నుంచి 14 క్వింటాళ్ల దిగుబడి ఇస్తాయి. రాగిని నేరుగా విత్తనాన్ని వెదజల్లి నారు పెంచి నాటే విధానంలో సాగు చేయవచ్చు. ఎకరాకు 2.5 కిలోల విత్తనం సరిపోతుంది.
ఎరువుల యాజమాన్యం: విత్తనాన్ని వరుసల మధ్య 15 నుంచి 20 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 15 సెంటీ మీటర్లు దూరంలో విత్తుకోవాలి. నారుమడికి 640 గ్రాముల లెక్కన నత్రజని, భాస్వరం, 480 గ్రాముల పొటాష్ ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. ప్రధాన పొలంలో నాలుగు టన్నుల పశువుల ఎరువులు వేసి ఆఖరి దుక్కిలో కలియదున్నాలి. ఎకరాకు 12 కిలోలు నత్రజని, 8 కిలోల పొటాష్, 12 కిలోల భాస్వరం ఇచ్చే ఎరువులు విత్తేటప్పుడు లేదా నాటేటప్పుడు వేసుకోవాలి. విత్తనాన్ని వెదజల్లేటప్పుడు భూమిని మెత్తగా తయారు చేసి విత్తనాన్ని సమానంగా చల్లుకోవాలి. విత్తనం చల్లిన తరువాత బల్లతో గాని, చెట్టు కొమ్మతో గాని చదును చేసుకోవాలి. విత్తిన వెంటనే మొలకలు రాక ముందు లీటర్ నీటిలో 3 మిల్లీ లీటర్లు పెండి మిథాలిన్‌ను కలిపి పిచికారీ చేయాలి. నాటిన 15 నుంచి 18 రోజులకు వెడల్పాటి కలుపు మొక్కలు ఉంటే 2,4–డీ సోడియం సాల్టును రెండు గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకుని కలుపు నివారించుకోవాలి.
సస్యరక్షణ చర్యలపై పెద్దవూర మండల వ్యవసాయాధికారి సూచనలు
సజ్జ విత్తనాలను జూన్ రెండో వారం నుంచి జూలై మూడో వారం వరకు విత్తుకోవచ్చు.
రకాలు: ఐసీఎంహెచ్ 356(హైబ్రీడ్), పీహెచ్‌బీ3, ఏహెచ్‌బీ 1 పేరున్న హైబ్రీడ్ రకాలను సాగుకు ఎంచుకోవాలి. ఎకరాకు 1.6 కిలోల విత్తనం వాడుకోవాలి. వరుసల మధ్య 45 సెంటీమీటర్లు, మొక్కల మధ్య 45 సెంటీమీటర్లు దూరంలో విత్తుకోవాలి.
విత్తనశుద్ధి: కిలో విత్తనానికి కాాఫ్టాన్ లేదా 3 గ్రాముల థైరామ్ కలిపి విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి.
ఎరువుల యాజమాన్యం: ఒక టన్ను పశువుల ఎరువుతో పాటు ఎకరాకు వర్షాధార పంటకు 24–12–8 చొప్పున, నీటి వసతి కింద 32–16–12 కిలోల చొప్పున నత్రజని–భాస్వరం–పొటాష్ ఎరువులను వేసుకోవాలి. నత్రజని ఎరువును రెండు దఫాలుగా పంట విత్తేటప్పుడు, విత్తిన 30 నుంచి 35 రోజులకు వేయాలి. రెండు సాళ్లు సజ్జ పంటకు ఒక సాలు కంది పంటను అంతర పంటగా వేసుకోవచ్చు. అట్రజిన్ కలుపు మందుతో కలుపును నివారించాలి. పంట కీలక దశల్లో నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి. సజ్జ పంట 70 నుంచి 80 రోజులలో కోతకు వచ్చి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుంది.


