యాదగిరిగుట్టలో 30 రిజిస్ట్రేషన్లు | - | Sakshi
Sakshi News home page

యాదగిరిగుట్టలో 30 రిజిస్ట్రేషన్లు

Jun 6 2026 1:05 AM | Updated on Jun 6 2026 1:05 AM

యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో శుక్రవారం 30 రిజిస్ట్రేషన్లు మాత్రమే అయినట్లు సబ్‌ రిజిస్టార్‌ ఖాధర్‌పాషా తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా భూముల విలువలు పెరిగిన నేపథ్యంలో శుక్రవారం నుంచి కొత్త ధరలు అమలులోకి వచ్చాయి. సుమారు గజానికి 51శాతం వరకు పెరిగినట్లు వెల్లడించారు. అత్యధికంగా యాదగిరిగుట్ట మున్సిపాలిటీలోని గుండ్లపల్లి ప్రధాన రహదారి వెంట గజం రూ.8,100 ఉంటే కొత్తగా వచ్చిన విలువ రూ.12,200కు పెరిగింది. ఇక యాదగిరిగుట్ట మండలంలోని జంగంపల్లి గ్రామంలో పాత విలువ రూ.700 ఉంటే ఇప్పుడు రూ.1,500లకు పెరిగింది. కాగా.. నూతన ధరలు అమల్లోకి వచ్చిన మొదటి రోజు 30 మాత్రమే డాక్యుమెంట్లు రిజిస్టేషన్‌ అయ్యాయని ఆయన పేర్కొన్నారు.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించాలి

భువనగిరిటౌన్‌ : పెంచిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలను వెంటనే తగ్గించాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్‌ చేశారు. భువనగిరిలోని సీపీఐ కార్యాలయంలో ఏశాల అశోక్‌ అధ్యక్షతన శుక్రవారం జరిగిన సీపీ ఐ జిల్లా కార్యవర్గ సమావేశంలో మా ట్లాడారు. కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 10న కలెక్టరేట్‌ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలి పారు. సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్‌రెడ్డి, సహాయ కార్యదర్శి బొలగాని సత్యనారాయణ, రాష్ట్ర కౌన్సి ల్‌ సభ్యుడు గోదా శ్రీరాములు, నాయ కులు కురిమిద్ది శ్రీనివాస్‌, కళ్లెం కృష్ణ్ణ, గాలయ్య, ముత్యాలు పాల్గొన్నారు.

సీఎం సభకు 3వేల మంది రైతులు

రామన్నపేట : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్‌ మండలం కోహెడలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పాల్గొననున్న రైతు మహోత్సవ సభకు జిల్లా నుంచి మూడువేల మంది రైతులను తరలించేలా ఏర్పాట్లు చేశారు. వ్యవసాయ, మార్కెటింగ్‌ శాఖల ఆధ్వర్యంలో 279 ఎకరాల్లో రూ.1,091 కోట్ల అంచనా వ్యయంతో కోహెడలో తలపెట్టిన పండ్ల మార్కెట్‌కు సీఎం శనివారం మధ్యాహ్నం శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం సాయంత్రం నిర్వహించనున్న బహిరంగ సభకు 62 ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేశారు. ఒక్కో బస్సులో 50 మంది వరకు తరలించనున్నారు. ఒక్కో బస్సుకు వ్యవసాయ విస్తరణాధికారితో పాటు వ్యవసాయాధికారులను బాధ్యులుగా, పది బస్సులకు సమన్వయ అధికారిని నియమించారు. రైతులకు అవసరమైన భోజనం, స్నాక్స్‌, తాగునీటి సౌకర్యం కల్పిస్తున్నారు. బహిరంగ సభ అనంతరం రైతులను సురక్షితంగా వారివారి స్వగ్రామాలకు తరలించడానికి వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు ఏర్పాట్లు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement