జిల్లాలో అత్యధికంగా హైవేల వెంట ఎకరం ధర రూ.కోటిన్నర | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో అత్యధికంగా హైవేల వెంట ఎకరం ధర రూ.కోటిన్నర

Jun 6 2026 1:05 AM | Updated on Jun 6 2026 1:05 AM

బీబీనగర్‌లో..

భువనగిరి మున్సిపాలిటీలో..

సాక్షి, యాదాద్రి : రాష్ట్ర వ్యాప్తంగా సవరించిన వ్యవసాయ, వ్యవసాయేతర భూముల ధరలు జిల్లాలోనూ భారీగా పెరిగాయి. హెచ్‌ఎండీఏ, వైటీడీఏ, జాతీయ రహదారులు, మున్సిపాలిటీల్లో సవరించిన విలువలు శుక్రవారం అమలులోకి వచ్చిన నేపథ్యంలో ధరలు గతంకంటే రెండింతలయ్యాయి. హెచ్‌ఎండీఏ మండలాల్లో గల జాతీయ రహదారులు–163, 65 వెంట ఉన్న భూముల ధర అత్యధికంగా ఎకరం రూ.కోటిన్నర దాటింది.

రియల్‌ ఎస్టేట్‌పై తీవ్ర ప్రభావం

పెరిగిన విలువల నేపఽథ్యంలో రిజిస్ట్రేషన్ల ధరలు పెరుగనున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భూముల ధరలకు రెక్కలు రావడంతో రిజిస్ట్రేషన్‌ చార్జీలు సైతం పెరిగాయి. దీంతో భూముల అమ్మకాలు మరింత దిగజారిపోనున్నాయని రియల్టర్లు వాపోతున్నారు.

చౌటుప్పల్‌లో 50 శాతం పెంపు

● చౌటుప్పల్‌ పట్టణంలో జాతీయ రహదారి వెంట గజానికి పాతధర రూ.21వేలు ఉండగా కొత్త ధర రూ.31,500తో యాభై శాతం పెరిగింది. పట్టణ కేంద్రంలో ఇతర ప్రాంతాల్లో గజం పాతధర రూ. 2,100 వేలు ఉండగా కొత్త ధర 80 శాతం పెరుగుతలతో రూ.3,700 వేలకు చేరింది.

● చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం, తూప్రాన్‌పేట గ్రామాల్లో జాతీయ రహదారి వెంట గజానికి కొత్త ధర రూ.7,200 పెరిగింది. చౌటుప్పల్‌ మండలంలోని ఇతర గ్రామాల్లో గజానికి పాత ధర రూ.2,100 ఉండగా కొత్తధర రూ.3,200కు పెరిగింది.

● చౌటుప్పల్‌ మండలం దండుమల్కాపురం రెవెన్యూ పరిధిలో ఎకరం మార్కెట్‌ ధర రూ.59.20లక్షలుంటే ప్రస్తుతం రూ.88,93,500లక్షలకు పెరిగింది.

● చౌటుప్పల్‌ పట్టణ రెవెన్యూ పరిధిలో గతంలో రూ.11.25లక్షలు ఉండగా ఇప్పుడు రూ.22,50లక్షలకు పెరిగింది. గతంలో అత్యధిక ధర రూ.42లక్షలు ఉండగా ప్రస్తుతం రూ.63 లక్షలకు పెరిగింది. మండలంలోని ఇతర గ్రామాల్లో పాత ధర ఎకరం రూ.7.50 లక్షలుండగా ప్రస్తుతం రూ.15లక్షలకు చేరింది.

ఆలేరులో ఎకరం రూ.31.50లక్షలు

● ఆలేరులో జాతీయ రహదారి వెంట ఎకరం రూ.21 లక్షల నుంచి రూ.31.50లక్షలకు వరకు పెరిగింది. (సాయిబాబా గుడి నుంచి బహదూర్‌ పేట నేషనల్‌ హైవే వరకు) అదే మార్గంలో కందిగడ్డ తండా నేషనల్‌ హైవే వరకు రూ.29.64 లక్షల నుంచి రూ.44.10లక్షల వరకు పెరిగింది.

● మంతపురి, గొలనుకొండ, తూర్పుగూడెం, శారాజిపేట, కొల్లూరు, సాయిగూడెం ప్రాంతాల్లో రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు పెంచారు. అదే మార్గంలో రోడ్డుకు అనుసంధానంగా ఉన్న ప్రాంతాల్లో రూ.15.25 లక్షలు నుంచి రూ.26,68,750 వరకు పెరిగింది.

మోత్కూరులో..

● మోత్కూరులో మున్సిపాలిటీలోని మెయిన్‌ రోడ్డు పక్కన గజానికి రూ.4,100 నుంచి రూ.5,200 వరకు పెంచారు. రోడ్డుకు లోపల రూ.2,100 నుంచి రూ.3,200, కొన్నిచోట్ల రూ.1,100 నుంచి రూ.2,000కు పెంచారు. మోత్కూరు మండలం సదర్శాపురంలో ఎకరాకు రూ.2.25 లక్షలు ఉండగా రూ.3.60లక్షల నుంచి రూ.6.70లక్షలకు పెరిగింది. కొన్ని చోట్ల రూ.9లక్షలు ఉంటే రూ.15 లక్షలకు, అత్యధికంగా మోత్కూరులో రూ.25 లక్షలు ఉండగా రూ.30 లక్షలకు పెరిగింది.

భూదాన్‌ పోచంపల్లి మండలంలో..

హెచ్‌ఎండీఏ పరిధిలో ఉన్న భూదాన్‌ పోచంపల్లి మండలంలో గతంలో ప్రధాన రోడ్ల వెంట, నివాస గృహాలకు సమీపంలో ఉన్న భూముల విలువ ఎకరాకు రూ.9 లక్షలు ఉండగా ప్రస్తుతం దానిని వంద శాతం అనగా రూ.18 లక్షల వరకు పెంచారు. రోడ్డుకు లోపలి వైపున ఉన్న భూముల విలువ రూ.7.50 లక్షల నుంచి 70 శాతం అనగా రూ.13,12,500కు పెంచారు.

సంస్థాన్‌ నారాయణపురం మండలంలో..

వ్యవసాయ భూములకు ఎకరానికి గతంలో అత్యల్పంగా రూ.2.25 లక్షలు ఉండగా ప్రస్తుతం రూ.10 లక్షలుకు పెంచారు. గతంలో ఎకరాకు రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి రూ.20 వేలు ట్యాక్స్‌ కట్టాల్సివస్తే, ప్రస్తుతం రూ.80 వేల చెల్లించాల్సి ఉంటుంది. గతంలో రాచకొండలో ఎకరాకు రూ.30 లక్షలు ఉంటే, ప్రస్తుతం రూ. 38.11 లక్షలకు పెంచారు.

రామన్నపేట మండలంలో..

రామన్నపేటతో పాటు బోగారం గ్రామాల్లో అత్యధికంగా ఎకరాకు రూ.50 లక్షల వరకు భూమి విలువ పెరిగింది. బాచుప్పల, తుర్కపల్లి గ్రామాల్లో అతి తక్కువగా రూ.4 లక్షల వరకు భూమి విలువ పెంచారు.

యాదగిరిగుట్ట మండలంలో..

అత్యధికంగా గుండ్లపల్లి ప్రధాన రహదారిలో గజానికి రూ.12,200 పెరిగింది. గతంలో ఇక్కడ రూ.8,100 మాత్రమే ఉండేది. ఇక జంగంపల్లిలో గజానికి రూ.700 ఉంటే.. ఇప్పుడు రూ.1,500లకు పెరిగింది. గజానికి సుమారు 51శాతం విలువ పెరిగింది.

జాతీయ రహదారి వెంట ఎకరం ధర అత్యధికంగా రూ.10,16,400 నుంచి రూ.1.60 కోట్లు అత్యధికంగా నిర్ణయించారు. ఆతర్వాత జాతీయ రహదారి వెంట కొండమడుగు రూ.29.60 లక్షల నుంచి రూ.1.50 కోట్లకు పెరిగింది. గూడూరులో రూ.71,15,500 నుంచి రూ.1.50 కోట్లకు పెరిగింది.

హైదరాబాద్‌–హన్మకొండ జాతీయ రహదారి పక్కన గజం ధర రూ.48,300కు పెరిగింది. అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ ధర ఫీట్‌కు రూ.2,200 నుంచి రూ.2,700 వరకు అనగా 23 శాతం పెరిగింది. జాతీయ రహదారి వెంట ఉన్న పాలక ఎస్టేట్‌ వంటి చోట్ల మాత్రం ధర రూ.12,600కుపెంచారు. పట్టణంలోని ఆబాదిలోని పలు ప్రాంతాల్లో ఽకనిష్ట ధర రూ.2,100 నుంచి రూ3,700 గా నిర్ణయించారు.

వ్యవసాయ భూమి జాతీయ రహదారి పక్కన బగాయత్‌లో రూ.70 లక్షల నుంచి రూ.1,16,88,600కు పెంచారు. రాయిగిరిలో రూ.1.06 కోట్లకు పెరిగింది. మండలంలో ఎకరానికి రూ.7.50 లక్షల నుంచి రూ.13,12,500 అనగా 85 శాతం పెరిగింది.

కమర్షియల్‌ ప్లాట్లకు గజానికి రూ.32,200 నుంచి రూ.48,300 వరకు అనగా 50 శాతం పెరిగింది. అపార్ట్‌మెంట్లలో ఫీట్‌కు రూ.2,200 నుంచి రూ.3,100 వరకు పెరిగింది. వ్యవసాయ భూములు ఎకరాకు రూ.13.50 లక్షల నుంచి రూ.23.62లక్షలకు అనగా 85 శాతం పెరిగింది.

ఫ హెచ్‌ఎండీఏ మండలాల్లో

రోడ్ల పక్కన వంద శాతం పెరుగుదల

ఫ భువనగిరిలో కమర్షియల్‌ ప్లాట్‌ గజం ధర 48,300 రూపాయలు

ఫ వ్యవసాయ భూమి రూ.1.16కోట్లు

ఫ అమలులోకి పెంచిన ధరలు

Advertisement
 
Advertisement
Advertisement