ఎరువు.. మరింత బరువు | - | Sakshi
Sakshi News home page

ఎరువు.. మరింత బరువు

Jun 6 2026 1:05 AM | Updated on Jun 6 2026 1:05 AM

కేంద్ర ప్రభుత్వమే భరించాలి

రామన్నపేట : ఎరువుల ధరలు భారీగా పెరగడంతో రైతులకు సాగు భారంగా మారనుంది. ఇప్పటికే విత్తనాలు, కూలీ రేట్లు, దున్నకం ఖర్చులు, హార్వెస్టర్ల అద్దెలు, పురుగు మందుల ధరలు పెరిగి నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ఎరువుల ధరలు పెరగడం వల్ల రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు పడ్డ చందంగా మారింది. పెరిగిన ఎరువుల ధరలు రైతులను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

సాగు అంచనా 4.75 లక్షల ఎకరాలు

జిల్లాలో గడిచిన పదేండ్లలో పంటల సాగు విస్తీర్ణం బాగా పెరిగింది. ప్రస్తుత వానాకాలంలో 4.75లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటల సాగు అవుతుందని అధికారులు అంచనా. ఇందులో 3.05లక్షల ఎకరాల్లో వరి, 1.40లక్షల ఎకరాల్లో పత్తిని సాగుచేసే అవకాశం ఉంది. గత వానాకా లంతో పోలిస్తే పది వేల ఎకరాల సాగు అదనం. పంటల సాగుకు యూరియా 37,766 మెట్రిక్‌ టన్నులు, డీఏపీ 15,562 మెట్రిక్‌ టన్నులు, సింగిల్‌ సూపర్‌ పాస్పేట్‌(ఎస్‌ఎస్‌పీ) 1,867 మెట్రిక్‌ టన్నులు, పోటాష్‌ 6,225 మెట్రిక్‌ టన్నులు, కాంప్లెక్స్‌ ఎరువులు 24,900 మెట్రిక్‌టన్నులు అవసరం అని అధికారులు గుర్తించారు.

భారీగా పెరిగిన ధరలు

కాంప్లెక్స్‌ ఎరువులతోపాటు, సింగిల్‌ సూపర్‌ పాస్పేట్‌ ధరలు భారీగా పెరగడం వల్ల జిల్లాలోని రైతులపై ఏడు నుంచి రూ.25కోట్ల మేర అదనపు భారం పడుతుంది. ఒక్కో కాంప్లెక్స్‌ ఎరువు బస్తా ధర ఇప్పుడున్న దానికంటే రూ.200 నుంచి రూ.500 వరకు పెరిగింది. దీంతోపాటు 20:20:0:13 ఎరువు ధర రూ.1,600 నుంచి రూ.2,100 పెరిగింది. 17:17:17 ధర రూ.1,700 నుంచి రూ.2,100 పెరిగింది. రైతులు అధికంగా ఉపయోగించే యూరియా, డీఏపీ ధరలు యధాతథంగా ఉండడం రైతులకు పెద్ద ఊరటను ఇచ్చే అంశం. యూరియా బస్తా రూ.266.50, డీఏపీ రూ.1,350కే లభిస్తాయి.

పెరిగిన సాగు ఖర్చులకు అనుగుణంగా ప్రభుత్వం పంటల మద్దతు ధరను పెంచడం లేదు. ఏటా నామమాత్రంగా మద్దతు ధర పెంచుతుంది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితుల వల్ల పెరిగిన కాంప్లెక్స్‌ ఎరువుల ధరల భారం రైతులపై పడకుండా కేంద్ర ప్రభుత్వమే భరించాలి. స్వామినాథన్‌ కమిషన్‌ సిఫారసులను వెంటనే అమలు చేయాలి.

– మేక అశోక్‌రెడ్డి రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు

ఫ జిల్లా రైతులపై రూ.25 కోట్లకుపైగా అదనపు భారం

ఫ కాంప్లెక్స్‌ ఎరువుల బస్తా ధర రూ.500 వరకు పెంపు

ఫ యూరియా, డీఏపీ ధరలు యధాతథంగా

వానాకాలం–2026

సాగు అంచనా (ఎకరాల్లో..)

వరి 3,05,000

పత్తి 1,40,000

కందులు 5,000

ఇతర పంటలు 25,000

అవసరమైన ఎరువులు

(మెట్రిక్‌ టన్నుల్లో..)

యూరియా 37,766

డీఎపీ 15,563

ఎస్‌ఎస్‌పీ 1,868

పోటాష్‌ 6,225

కాంప్లెక్స్‌ ఎరువులు 24,900

Advertisement
 
Advertisement
Advertisement