అడవుల పరిరక్షణలో భాగస్వాములు కావాలి | - | Sakshi
Sakshi News home page

అడవుల పరిరక్షణలో భాగస్వాములు కావాలి

Jun 6 2026 1:05 AM | Updated on Jun 6 2026 1:05 AM

రాష్ట్ర ఫారెస్ట్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ శరవణన్‌

తుర్కపల్లి : అడవుల పరిరక్షణలో ప్రతిఒక్కరూ భాగస్వాములు కావాలని రాష్ట్ర ఫారెస్ట్‌ చీఫ్‌ కన్జర్వేటర్‌ శరవణన్‌ పిలుపునిచ్చారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా తుర్కపల్లి మండలం తిరుమలపూర్‌ గ్రామంలోని ఫారెస్ట్‌ భూముల్లోని 5 ఎకరాల విస్తీర్ణంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలతో కలిసి 5వేల మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల నుంచి భూమిని, మానవ జీవ జాతులను కాపాడుకోవాలంటే చెట్ల నాటడం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ వినియోగాన్ని పూర్తిగా తగ్గించి, దారపు సంచులు, గోనె సంచులు వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫారెస్ట్‌ కన్జర్వేటర్‌ శివల రాంబాబు, జిల్లా ఫారెస్ట్‌ అధికారి సుధాకర్‌, ఆలేరు మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సస్‌ ఐనాల చైతన్య మహేందర్‌రెడ్డి, ఎంపీడీఓ గీతారెడ్డి, శైలజ, మల్లేష్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement