కాలుష్య కంపెనీలపై చర్యలు తీసుకోండి | - | Sakshi
Sakshi News home page

కాలుష్య కంపెనీలపై చర్యలు తీసుకోండి

Jun 6 2026 1:05 AM | Updated on Jun 6 2026 1:05 AM

భూదాన్‌పోచంపల్లి : కాలుష్యకారక రసాయన కంపెనీలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ శుక్రవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లోని పొల్యుషన్‌ కంట్రోల్‌ బోర్డు (పీసీబీ) కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర అటవీ, పర్యావరణశాఖ మంత్రి కొండా సురేఖకు పోచంపల్లి మండలం అంతమ్మగూడెం గ్రామ రైతులు కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అంతమ్మగూడెం కాలుష్య విముక్తి పోరాట సమితి అధ్యక్షుడు గుమ్మి దామోదర్‌రెడ్డి మాట్లాడుతూ పలు విషయాలను వివరించారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందిస్తూ త్వరలో సమావేశం నిర్వహించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అంతకుముందు పీసీబీ కార్యాలయం ఎదుట నల్లబ్యాడ్జీలు ధరించి, దున్నపోతు ప్లెక్సీతో నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో పోరాటసమితి నాయకులు గుమ్మి నరేందర్‌రెడ్డి, రావుల శశికిరణ్‌, ప్రభ, ధనలక్ష్మి, బాల్‌రెడ్డి, రాంరెడ్డి, నర్సింహచారి, మహేశ్‌, రేణుక, శారదమ్మ, ముత్తమ్మ, అండాలు, నర్సింహ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement