ఫిట్‌నెస్‌ లేకుంటే సీజ్‌ | - | Sakshi
Sakshi News home page

ఫిట్‌నెస్‌ లేకుంటే సీజ్‌

Jun 5 2026 10:09 AM | Updated on Jun 5 2026 10:09 AM

తప్పనిసరిగా ఫిట్‌నెస్‌

సర్టిఫికెట్‌ పొందాలి

భువనగిరి: ఈ నెల 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలో బడి బస్సుల భద్రతపై రవాణాశాఖ నిఘా పెంచింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న 380 స్కూల్‌ బస్సుల్లో ఇప్పటివరకు 250 వాహనాలు మాత్రమే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందాయి. ఏడురోజులే గడువు ఉండడంతో మిగిలిన బస్సులు కూడా నిబంధనల ప్రకారం ఫిట్‌నెస్‌ నిరూపించుకోవాలని, లేదంటే రోడ్డెక్కిన వెంటనే సీజ్‌ చేస్తామని అధికారులు హెచ్చరిస్తున్నారు.

రోజూ సామర్థ్య పరీక్షలు

ఏటా మే 15వ తేదీ నాటికి బడి బస్సుల ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ గడువు ముగుస్తుంది. విద్యాలయాలు ప్రారంభమయ్యే నాటికి యాజమాన్యాలు తమ బడిబస్సులకు ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు తీసుకోవాలి. ఈ నేపథ్యంలో రవాణా శాఖ అదికారులు ఆర్టీఏకార్యాలయాల్లో మే 16వ తేదీ నుంచి రోజూ బడిబస్సులకు సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.బస్సుకు సంబంధించిన అన్ని ధ్రువీకరణపత్రాలు, విద్యార్థులకు వసతులు సక్రమంగా ఉన్నాయా? భద్రత ప్రమాణాలు పాటిస్తున్నారా అని పరిశీలిస్తారు. ఎంవీఐలు బస్సులను నడిపి ఫిట్‌నెస్‌ను తనిఖీ చేస్తున్నారు. బస్సులకు ఏమైనామరమ్మతులు ఉంటే చేయించుకో వావాలని సూచించి వెనక్కి పంపించేస్తున్నారు. ఆ తరువాతే ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్స్‌ అందజేస్తున్నారు. ఈ ఏడాది మూడంచెల విధానాన్ని అనుసరిస్తున్నారు. బడి ఇన్‌చార్జి, ప్రిన్సిపల్‌, ఎంవీఐ సంతకాలు బడి బస్సు పై ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ఈ సౌకర్యాలు తప్పనిసరి

● బడి బస్సులో అత్యవసర గ్లాస్‌ ద్వారం, మంటలార్పే పరికరాలు, ప్రథమ చికిత్స కిట్‌, పుస్తకాలు పెట్టుకునేందుకు హ్యాంగర్లు

● కిటికీల వద్ద ఇనుప గ్రిల్స్‌,ఫైర్‌ అలారం, మంటలార్పే వాటర్‌ స్ప్రింక్లర్లు

● పిల్లలు పట్టుకునేలా నిలువు స్తంభాలు, ఇండికేటర్‌ లైట్లు, అద్దాలు, తలుపుల వద్ద లాకింగ్‌ సిస్టం

● పిల్లలు ఎక్కేందుకు వీలుగా పటిష్టమైన ఫుట్‌బోర్డు, మెకానిక్‌ పరికరాలు ఉండాలి

● ఇంజన్‌ సామర్థ్యం బాగా ఉండాలి

ఫ 12 నుంచి పాఠశాలలు పునః ప్రారంభం

ఫ జిల్లావ్యాప్తంగా 380 ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులు

ఫ ఇప్పటి వరకు సర్టిఫికెట్‌ పొందింది 250 బస్సులకే

ఫ గడువు ఏడురోజులే..

బడి బస్సులు ఈ నెల 11 తేదీ వరకు రవాణాశాఖ నుంచి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్‌ పొందాలి.ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్స్‌ లేకుండా రోడ్ల పై బస్సులు నడిపితే శాఖా పరమైన చర్యలు తీసుకుంటాం. కేసులు నమోదు చేయడంతో పాటు బస్సులను స్వాధీనం చేసుకుంటాం. ఈ నెల 12నుంచి తనిఖీలు చేపడుతాం.

–ఎస్‌ నరేష్‌, జిల్లా రవాణా అధికారి

Advertisement
 
Advertisement
Advertisement