ప్రభుత్వ పాఠశాలకు పంపే వారికే ఇందిరమ్మ ఇళ్లు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ పాఠశాలకు పంపే వారికే ఇందిరమ్మ ఇళ్లు

Jun 5 2026 10:09 AM | Updated on Jun 5 2026 10:09 AM

భూదాన్‌పోచంపల్లి: తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపే వారికి రెండో విడతలో ఇందిరమ్మ ఇళ్ల కేటా యింపులో ప్రాధాన్యత ఇవ్వాలని అడిషనల్‌ కలెక్టర్‌ భాస్కర్‌రావు అన్నారు. గురువారం పోచంపల్లి మున్సిపాలిటీలోని 3వ వార్డులోగల రేవనపల్లిలో ప్రజాపాలన ప్రగతి నివేదిక వార్డుసభలో పాల్గొని మాట్లాడారు. ప్రజలకు ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, సన్నబియ్యం అన్ని సంక్షేమ పథకాలు కావాలి, కానీ ప్రభుత్వ స్కూళ్లు, ప్రభుత్వ ఆసుపత్రులు మాత్రం వద్దంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని కోరారు. నాణ్యమైన వైద్యసేవల కోసం సమీపంలో ఉన్న బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ ఆసుపత్రితో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. దాంతో స్థానికులు స్పందిస్తూ పీహెచ్‌సీలో రోగులను పట్టించుకోవడంలేదని చెప్పడంతో అడిషనల్‌ కలెక్టర్‌ స్పందించి వెంటనే మండల వైద్యాధికారిణి శ్రీవాణికి ఫోన్‌చేసి సభకు పిలిపించారు. తమ తీరును మార్చుకొని రోగులకు నాణ్యమైన సేవలందించి వారి మన్ననలు పొందాలన్నారు. మున్సిపాలిటీ పరిధిలో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల కాలనీలో మౌళిక వసతులు కల్పించి త్వరలో లబ్దిదారులకు ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పారు.రెండో విడతలో కేవలం మున్సిపాలిటీలకు 40శాతం ఇందిరమ్మ ఇళ్లు వస్తాయని చెప్పారు. బస్వలింగేశ్వరకాలనీలో నిర్మించుకొని నివాసం ఉంటున్న ఇళ్లకు ఇంటి నంబర్లు ఇవ్వాలని, కొత్తగా నిర్మించుకునే వారికి అనుమతులను ఇప్పించాలని కర్నాటి పురుషోత్తం ఆధ్వర్యంలో కాలనీవాసులు అడిషనల్‌ కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ అంజన్‌రెడ్డి, స్థానిక కౌన్సిలర్‌ రావుల జంగయ్య, కోఆప్షన్‌సభ్యురాలు రసూల్‌బీ, సీనియర్‌ అసిస్టెంట్‌ రాజేశ్‌, వార్డు ఆఫీసర్‌ రావీష్‌, రావుల అనిల్‌ పాల్గొన్నారు.

ఫ అడిషనల్‌ కలెక్టర్‌ భాస్కర్‌రావు

Advertisement
 
Advertisement
Advertisement