కారు ఢీకొని దుర్మరణం | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని దుర్మరణం

Jun 5 2026 10:09 AM | Updated on Jun 5 2026 10:09 AM

నాగారం : రోడ్డు దాటుతున్న వృద్ధురాలిని కారు ఢీకొనడంతో మృతిచెందింది. ఈ ఘటన బుధవారం రాత్రి సూర్యాపేట–జనగామ జాతీయ రహదారిపై నాగారం మండలంలోని నాగారం బంగ్లా గ్రామం వద్ద చోటు చేసుకుంది. గురువారం పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నాగారంబంగ్లా గ్రామానికి చెందిన పాశం శాంతమ్మ (80) అదే గ్రామంలో తన కుమారుడు పాశం యాదవరెడ్డి ఇంటికి వెళ్లి తిరిగి వచ్చే క్రమంలో రోడ్డు దాటుతుండగా సూర్యాపేట నుంచి తిరుమలగిరి వైపు వెళ్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శాంతమ్మకు తీవ్ర గాయాలు కావడంతో ఆమెను చికిత్స నిమిత్తం సూర్యాపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. మృతురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ భగవాన్‌నాయక్‌ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement