యాదగిరిగుట్ట : యాదగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీల్లో భక్తులు సమర్పించుకున్న నగదు, నగలను ఈఓ భవానీశంకర్, అనువంశిక ధర్మకర్త బి. నర్సింహమూర్తి ఆధ్వర్యంలో కొండ దిగువన ఉన్న సత్యనారాయణస్వామి వ్రత మండపంలో గురువారం లెక్కించారు. ఈ లెక్కింపులో భాగంగా రూ.3,18,37,261 నగదు వచ్చిందని ఈఓ తెలిపారు. మిశ్రమ బంగారం 179 గ్రాములు, మిశ్రమ వెండి 3 కిలోలు వచ్చినట్లు వెల్లడించారు. వివిధ దేశాలకు చెందిన కరెన్సీలు సైతం హుండీల్లో లభించాయన్నారు. ఈ హుండీ ఆదాయం 30 రోజులదని ఈఓ భవానీశంకర్ పేర్కొన్నారు.
వడదెబ్బతో ఇద్దరు మృతి
తిరుమలగిరి(తుంగతుర్తి) : తిరుమలగిరి మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డుకు చెందిన పోతరాజు దానయ్య(61) వడదెబ్బతో రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందారు.
మిర్యాలగూడ పట్టణంలో..
మిర్యాలగూడ అర్బన్ : మిర్యాలగూడ పట్టణంలోని సంతోష్‌నగర్‌కు చెందిన రాపోలు పుల్లారావు(47) అద్దె ఇంట్లో నివాసముంటూ గుమాస్తాగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఎండల తీవ్రతకు పుల్లారావు వడదెబ్బకు గురై గురువారం మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు.
ట్రాక్టర్ చోరీ
చేసేందుకు యత్నం
ఫ దొంగను పట్టుకున్న గ్రామస్తులు
చిట్యాల : వ్యవసాయ పొలం వద్ద పార్కింగ్ చేసిన ట్రాక్టర్‌ను గుర్తుతెలియని వ్యక్తి చోరీ చేసి తీసుకెళ్తూ కారును ఢీకొట్టా డు.. గ్రామస్తులు అతడిని పట్టుకున్నారు. ఈ ఘటన చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామ పరిధిలో గురువారం జరిగింది. పెద్దకాపర్తి గ్రామానికి చెందిన పొట్లపల్లి లింగయ్య తన ట్రాక్టర్‌ను పొలం వద్ద పార్కింగ్ చేసి ఉంచాడు. గుర్తుతెలియని వ్యక్తి ఆ ట్రాక్టర్‌ను దొంగిలించి డ్రైవింగ్ చేసుకుంటూ విజయవాడ–హైదరాబాద్ జాతీయ రహదారికి పైకి వచ్చే క్రమంలో ముందు వెళ్తున్న కారును ఢీకొట్టాడు. దీంతో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు ఆ దొంగతో వాగ్వాదానికి దిగారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న గ్రామస్తులు ఆ ట్రాక్టర్‌ను చోరీ చేసి తీసుకెళ్తున్నట్లు గుర్తించి.. దొంగ కాళ్లు, చేతులు కట్టేసి వెంటనే చిట్యాల పోలీసులకు సమాచారం అందించారు. కాగా చోరీకి పాల్పడిన వ్యక్తి వివరాలు తెలియరాలేదు.


