‘ఆరోగ్య లక్ష్మి’ని సద్వినియోగం చేసుకోవాలి
భువనగిరి(బీబీనగర్): ఆరోగ్యలక్ష్మి భోజనాన్ని సద్వినియోగం చేసుకోవాలని సీ్త్ర శిశు, వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితారామచంద్రన్ కోరారు. బీబీనగర్ మండల కేంద్రంలోని 5,6వ నంబర్ గల అంగన్‌వాడీ కేంద్రాలను మంగళవారం సీ్త్ర శిశు, వికలాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితారామచంద్రన్ తనిఖీ చేశారు. కేంద్రంలోని గర్భిణులతో మాట్లాడారు. ఆరోగ్యలక్ష్మి భోజనం, మెనూ, అందిస్తున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. కేంద్రాలు ఇంకా సక్రమంగా నడవాలంటే ఎలాంటి సదుపాయాలు కల్పించాలని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బీబీనగర్‌లో ప్రారంభమైన వయోవృద్ధుల డాట కేర్ సెంటర్‌ను సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి నరసింహారావు, సీడీపీఓ శైలజ, అంగన్‌వాడీ టీచర్లు ఉన్నారు.
ఫ సీ్త్ర శిశు, వికలాంగుల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అనితారామచంద్రన్


