యాదగిరి క్షేత్రంలో భక్తుల రద్దీ
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో శనివారం భక్తుల రద్దీ నెలకొంది. సంక్రాంతి సెలవుల్లో మేడారం, కొమురవెల్లి, ఐనవోలు వంటి ఆలయాలకు వెళ్లిన భక్తులు తిరుగు ప్రయాణంలో యాదగిరీశుడిని దర్శించుకొని వెళ్తున్నారు. దీంతో ఆలయ పరిసరాలు భక్తులతో కోలాహలంగా మారాయి. ధర్మ దర్శనానికి రెండు గంటలకు పైగా, వీఐపీ దర్శనానికి 45 నిమిషాల సమయం పట్టింది. శ్రీస్వామిని 35వేల మందికి పైగా భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వివిధ పూజలతో శ్రీస్వామి వారికి నిత్యాదాయం రూ.35,07,311 వచ్చినట్లు ఆలయాధికారులు వెల్లడించారు.


