కేటీఆర్, హరీశ్‌లతో బీఆర్‌ఎస్ నాయకుల భేటీ
నల్లగొండ టూటౌన్: ఉమ్మడి జిల్లాలోని బీఆర్‌ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, మాజీ ఎంపీ, ఇతర ముఖ్య నాయకులు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి తో కలిసి శనివారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్‌లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికలు, పార్టీ బలోపేతం పలు అంశాలపై చర్చించారు. వారిలో పార్టీ జిల్లా అధ్యక్షుడు రమావత్ రవీంద్ర కుమార్, ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, భాస్కర్ రావు, గాదరి కిషోర్ కుమార్, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్‌రెడ్డి, బూడిద భిక్షమయ్యగౌడ్, గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, భగత్ కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, సీనియర్ నాయకులు పాల్వాయి స్రవంతి, చింతల వెంకటేశ్వర రెడ్డి ఉన్నారు.


