నేరుగా వరి విత్తనాలు విత్తే పద్ధతితో అధిక దిగుబడులు
గరిడేపల్లి: నేరుగా వరి విత్తనాలు విత్తే పద్ధతితో అధిక దిగుబడులు సాధించవచ్చని భారత వరి పరిశోధనా సంస్థ ప్రధాన శాస్త్రవేత్త మహేందర్‌కుమార్, అగ్రానమి విభాగాధిపతి సాయిప్రసాద్ అన్నారు. శనివారం ఎస్‌బీఐ ఫౌండేషన్ కార్యక్రమంలో భాగంగా వరి విత్తనాలు నేరుగా విత్తే సాగుపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. డీఎస్‌ఆర్ ప్రాజెక్టు ద్వారా రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించి వరి సాగును సుస్థిరంగా అభివృద్ధి చేయడమే లక్ష్యమన్నారు. నేరుగా విత్తిన వరి సాగులో పాటించాల్సిన భూమి తయారీ, విత్తన మోతాదు. పోషకాల నిర్వహణ, కలుపు నియంత్రణ, నీటి యాజమాన్యం, ఖర్చు తగ్గించే సాగు పద్ధతులపై రైతులకు వివరించారు. ప్రాజెక్టు ద్వారా నేరుగా విత్తే వరికి అనుకూలమైన ధాన్60 వరి విత్తనాన్ని, హూమిక్ యాసిడ్ గ్రాన్యూల్స్‌ను రైతులకు అందించారు. కార్యక్రమంలో కేవీకే శాస్త్రవేత్తలు నరేష్, కిరణ్‌కుమార్, ఎస్‌బీఐ, డీఎస్‌ఆర్ ప్రాజెక్టు రీసెర్చ్ అసోసియేట్ కవిరాజు తదితరులు పాల్గొన్నారు.


