మేడారం ప్రసాదం పంపిణీకి ఆర్టీసీ శ్రీకారం
రామగిరి(నల్లగొండ): దేవాదాయ శాఖ సహకారంతో ఆర్టీసీ లాజిస్టిక్ ద్వారా మేడారం సమ్మక్క సారలమ్మ అమ్మవార్ల ప్రసాదం, దేవతల ఫొటోతో సహా పసుపు, కుంకుమ అందజేయనున్నట్లు రీజనల్ మేనేజర్ జానిరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను శనివారం నల్లగొండలో ఆవిష్కరించిన అనంతరం రీజనల్ మేనేజర్ జానిరెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల 28 నుంచి 31 వరకు జరిగే మేడారం జాతర సందర్భంగా ఆర్టీసీ స్పెషల్ బస్సులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ప్రసాదం కోసం www.tgsrtclogistics.co.in వెబ్‌సైట్‌లో లేదా సమీపంలోని ఆర్టీసీ లాజిస్టిక్స్ కౌంటర్లలో రూ.299 చెల్లించి ప్రసాదాన్ని బుక్ చేసుకోవచ్చని తెలిపారు. మరింత సమాచారం కోసం నల్ల గొండ 9154298690, మిర్యాలగూడ 9154298693, దేవరకొండ 9154298694, సూర్యాపేట 9154298695 నంబర్లను సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బద్రి నారాయణ, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


