పంటలు లేవు.. పండుగ లేదు
సంక్రాంతిని బాధతో జరుపుకొన్నాం
పండుగ చేసుకోలేక పోయాం
ప్రాజెక్ట్ కోసం భూములు ఇచ్చిన మాకు ప్రభుత్వం నష్టపరిహరం కింద ఇప్పటివరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. ఐదేళ్లుగా తండా ప్రజలు పరిహారం కోసం నిరీక్షిస్తున్నారు. డబ్బులు వచ్చి ఉంటే గ్రామ దేవతల పండుగలతో పాటు సంక్రాంతిని ఘనంగా జరుపుకొనేవాళ్లం. కానీ ఈ సారి పండుగను ఆనందంగా జరుపుకోలేక పోయాం.
భూక్య రాజారాంనాయక్, చౌక్లతండా సర్పంచ్
ప్రభుత్వం కేటాయించిన భూముల్లో ఇళ్లు కట్టుకొని ప్రశాంతంగా జీవించాలనుకున్నాం. కానీ పరిహారం ఇవ్వక పోవడంతో జీవనోపాధి లేకుండా పోయింది. చేతిలో డబ్బులు లేక పండుగలకు కూడా దూరమయ్యాం. ప్రభుత్వం వెంటనే నష్టపరిహరం విడుదల చేయాలి
భూక్య వెంకటేశ్‌నాయక్, చౌక్లతండా
ఫ బస్వాపురం రిజర్వాయర్ ముంపు
గ్రామాల్లో కానరాని సంక్రాంతి
ఫ సాగు భూములు కోల్పోవడంతో
పాడి పంటలకు దూరం
ఫ నష్టపరిహారం అందక ఆర్థిక ఇబ్బందులు
యాదగిరిగుట్ట రూరల్, తుర్కపల్లి : బస్వాపురం రిజర్వాయర్‌లో ముంపునకు గురవుతున్న గ్రామాల్లో ఈ సారి సంక్రాంతి సందడి కనిపించలేదు. గతంలో వ్యవసాయ భూముల్లో సంవృద్ధిగా పంటలు పండగా.. రైతుల ఇళ్లు పాడి పంటలతో నిండుగా ఉండగా తండాల ప్రజలు సంతోషంగా పండుగను జరుపుకొన్నారు. కానీ ప్రస్తుతం సాగు భూములతో పాటు ఇళ్లు కోల్పోయారు. దాంతో పాడి, పంటలు లేక, మరి కొద్ది రోజుల్లో గ్రామాన్ని వీడాలనే బాధతో సంక్రాంతిని వేడుకలను జరుపుకోలేక పోయామని తండావాసులు చెప్పారు.
లప్పానాయక్ తండాలో 327 కుటుంబాలు
యాదగిరిగుట్ట మండలంలోని లప్పానాయక్ తండాలో 327 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ తండా వాసులకు సంబంధించిన 721 ఎకరాల భూమిని ప్రభుత్వం బస్వాపురం రిజర్వాయర్ కోసం తీసుకుంది. దాంతో తండా వాసులు ఇల్లు వాకిలి, వ్యవసాయ భూములు కోల్పోయారు. పునరావాస ప్రాంతానికి వెళ్లడానికి సిద్ధమయ్యారు. ప్రభుత్వం వీరందరికి యాదగిరిగుట్ట మండలం దాతర్‌పల్లి గ్రామంలోని 30 ఎకరాల్లో మౌళిక వసతులు కల్పిస్తున్నది. ఉన్న ఊరును వదిలి వెళ్లాల్సి వస్తుందనే బాధతో ఈ సారి సంక్రాంతి వేడుకలకు తండావాసులు దూరమయ్యారు. తండాలో జన సంచారం లేకుండా పోయింది.
పరిహారం రాక ఆర్థిక ఇబ్బందులు
బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు గ్రామాలైన తుర్కపల్లి మండలంలోని చౌక్లతండా, కొక్యాతండా, పిర్యాతండాల్లో ఈ సారి సంక్రాంతి సంబురాలు కనిపించలేదు. ప్రాజెక్ట్ కోసం తమ భూములు త్యాగం చేసిన రైతులు, తండావాసులు ప్రభుత్వ ఇవ్వాల్సిన నష్టపరిహారం కోసం ఐదేళ్లుగా ఎదురుచూస్తున్నా తమకు ఇప్పటికీ న్యాయం జరుగలేదని ఆయా తండాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు జీవనాధారమైన భూములు కోల్పోయామని, పరిహారం అందక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. చేతిలో డబ్బులు లేక పండుగకు కావాల్సిన కొత్త బట్టలు, సామగ్రి కొనలేక ఈ సంక్రాతి రోజున నిరుత్సాహంగా గడిపినట్లు గ్రామస్తులు తెలిపారు. భూములు త్యాగం చేసినా న్యాయంగా రావాల్సిన పరిహారం దక్కలేదని, రప్రభుత్వం తక్షణమే నష్టపరిహరం చెల్లించాలని గ్రామస్తులు కోరుతున్నారు.
బస్వాపురం రిజర్వాయర్‌లో మా గ్రా మం ముంపునకు గురైంది. మేమంతా మరొక చోటుకు వెళ్లాలి. అందుకే ఈ సంక్రాంతి పండుగను బాధతో జరుపుకొన్నాం. పంటలు పండించుకొని సంతోషంగా జరుపుకోవాల్సిన పండుగ, భూములు కోల్పోయి ప్రతీది కొనుగోలు చేసుకొని జరుపుకోవాల్సి వచ్చింది. పునరావాస ప్రాంతానికి వెళ్లిన తర్వాత మాకు ఉపాధి ఉండదు. ప్రభుత్వం ఉపాధి కల్పించి ఆదుకోవాలి. – భరత్, లప్పానాయక్ తండా
గతంలో మా భూముల్లో కందులు, నువ్వులు, ఉలువలు, వేరుశనగ వంటి వాటిని పండించుకొని, సంక్రాంతి పండగను సంతోషంగా జరుపుకొనే వాళ్లం. ఇప్పుడు బస్వాపురం రిజర్వాయర్‌లో ఇళ్లతో పాటు వ్యవసాయ భూములు ముంపుకు గురై గుంతలు, నీళ్లు తప్పా ఏమి లేవు. పంటలు లేక సంక్రాంతి పండుగ వాతావరణాన్ని కోల్పోయాం.
–బిచ్యానాయక్, లప్పానాయక్ తండా
పంటలు లేవు.. పండుగ లేదు
పంటలు లేవు.. పండుగ లేదు
పంటలు లేవు.. పండుగ లేదు
పంటలు లేవు.. పండుగ లేదు


