సైనికుడికి పాదాభివందనం
గరిడేపల్లి : సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మండలంలోని కల్మలచెరువు గ్రామానికి చెందిన సైనికుడు వట్టే దశరథ్ యాదవ్‌కు బీఆర్‌ఎస్ నాయకుడు రాపోలు నవీన్‌కుమార్‌తో పాటు స్థానికులు పాదాభివందనం చేశారు. ఇండియన్ ఆర్మీలో పని చేస్తున్న దశరథ్ యాదవ్ సంక్రాంతి సెలవుల నిమిత్తం స్వగ్రామానికి వచ్చాడు. గ్రామస్తులు అతడి పాదాలు పాలతో కడిగి ఘనంగా సన్మానించారు. దేశరక్షణకు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా సేవ చేస్తున్న సైనికుడిని గౌరవించడం ప్రతిఒక్కరి బాధ్యత అంటూ వారు పేర్కొన్నారు.
భారత సైనికుడు వట్టే దశరథ్ యాదవ్ కాళ్లు కడుగుతున్న నవీన్‌కుమార్, స్థానికులు


