యాదగిరీశుడి సన్నిధిలో నిత్య కల్యాణ వేడుక
యాదగిరిగుట్ట: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయంలో గురువారం నిత్య కల్యాణ వేడుకను ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారంగా నిర్వహించారు. వేకువజామునే ఆలయాన్ని తెరచిన అర్చకులు శ్రీస్వామి అమ్మవార్లకు సుప్రభాతం జరిపించారు. అనంతరం గర్భాలయంలోని స్వయంభూ, ప్రతిష్ఠా అలంకారమూర్తులకు నిజాభిషేకం, తులసీ దళాలతో అర్చన వంటి పూజలు చేపట్టారు. ఇక ఆలయ మండపంలో శ్రీసుదర్శన నారసింహ హోమం, గజ వాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం వంటి కై ంకర్యాలను భక్తులచే నిర్వహించారు. ముఖ మండపంలో సువర్ణ పుష్పార్చన మూర్తులకు అష్టోత్తర పూజలను భక్తులతో జరిపించారు. వివిధ పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు.
ప్రత్యేక గ్రీవెన్స్‌కు 80 అర్జీలు
భువనగిరిటౌన్ : కలెక్టరేట్‌లో గురువారం నిర్వహించిన ప్రత్యేక గ్రీవెన్స్, ఉద్యోగవాణికి 80 అర్జీలు వచ్చాయి. వీటిని కలెక్టర్ స్వీకరించారు. కొన్ని సమస్యలను అప్పటికప్పుడే పరిష్కరించారు. దీర్ఘకాలంగా ధరణిలో పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలకు సంబంధించిన ఫైల్స్ క్లియర్ చేశారు. బొమ్మలరామారం మండలం మర్యాలలో సమాధులకోసం కొందరు భూమి కబ్జాచేశారని బాధితులు వినతిపత్రం ఇచ్చారు. వెంటనే తహసీల్దార్‌కు కలెక్టర్ ఫోన్ చేశారు. కబ్జాచేసిన స్థలం వెంటనే తిరిగి ఇవ్వాలని ఆదేశించారు.
భువనగిరిలో బీజేపీ విజయం ఖాయం
భువనగిరి: వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో భువనగిరి మున్సిపాలిటీలో బీజేపీ విజయం ఖాయనమి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. గురువారం భువనగిరిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్, కాసం వెంకటేశ్వర్లు, పోతంశెట్టి రవీందర్, పడాల శ్రీనివాస్, దాసరి మల్లేశం, పడమటి జగన్మోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఊట్కూరి అశోక్, పాశం భాస్కర్, చందా మహేందర్ గుప్తా, సుర్వి శ్రీనివాస్, చందుపట్ల వెంకటేశ్వర్‌రావు, మహమూద్,మేడి కోటేష్, రత్నపురం బలరాం పాల్గొన్నారు.
యాదాద్రి జిల్లా నుంచే నిర్వహించాలి
మోత్కూరు: అడ్డగూడూరు, మోత్కూరు మండలాల బీజేపీ కార్యక్రమాలను యాదాద్రి జిల్లా నుంచే నిర్వహించాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు సూచించారు. సూర్యాపేట జిల్లా నుంచి పార్టీ కార్యక్రమాలు నిర్విహిస్తేు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని నాయకులు గురువారం భువనగిరిలో ఆయన దృష్టికితేవడంతో ఈ సూచన చేశారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో నాయకులు గుజ్జ సోమనర్సయ్య, తుమ్మల మురళీధర్‌రెడ్డి, పోచం సోమయ్య, ఏనుగు జితేందర్‌రెడ్డి, గూదె మధుసూదన్ యాదవ్, ననుబోతు సైదులు యాదవ్ తదితరులు ఉన్నారు.
యాదగిరీశుడి సన్నిధిలో నిత్య కల్యాణ వేడుక


