నరసాపురం: న్యాయసేవాధికారి సంస్థ సేవలు సద్వినియోగం చేసుకోవాలని నరసాపురం ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఆర్.వరలక్ష్మి సూచించారు. న్యాయసేవాధికార సంస్థ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోమవారం కోర్టు వద్ద నిర్వహించిన అవగాహన సదస్సుల్లో ఆమె మాట్లాడారు. సమన్యాయం, ఉచి త న్యాయం, సత్వర న్యాయం ఉద్దేశంతో 1987లో న్యాయసేవాధికార సంస్థ ఏర్పడిందన్నారు. కేసుల సత్వర పరిష్కారం కోసం మండల న్యాయసేవాధికార సంస్థ నిర్వహిస్తున్న లోక్ అదాలత్‌లను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నరసాపురం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు నిడమోలు జ్ఞానానంద్ అధ్యక్షత వహించగా అదనపు జూనియర్ సివిల్ జడ్జి ఎస్.రాజ్యలక్ష్మి, ఆర్డీఓ దాసి రాజు, డీఎస్పీ ఎం.సుధాకర్ మాట్లాడారు.
భీమవరం (ప్రకాశంచౌక్): భారీ వర్షాలు, వరదలతో జిల్లాలో ముంపు బాధిత ప్రజలకు తక్షణ సాయం అందించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. ఎర్రకాలువ, యనమదుర్రు డ్రెయిన్ వరదతో ముంపునకు గురైన గ్రామాల్లో యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టాలన్నారు. బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్షేత్రస్థాయిలో ప ర్యవేక్షిస్తూ, సహాయక చర్యలు చేపట్టాలని స్ప ష్టం చేశారు. జేసీ కేఆర్ కల్పశ్రీ, డీఆర్వో పి.గ్లోరియా, ఆర్డీఓలు పాల్గొన్నారు.
తాళాలు బద్దలు కొట్టి ఓట్ల లెక్కింపు
సాక్షి టాస్క్‌ఫోర్స్: కౌంటింగ్ కేంద్రంలో ఎన్నికల అధికారుల నిర్లక్ష్యం చర్చనీయాంశంగా మారింది. ఇరగవరం మండలం జెడ్పీటీసీ, ఎంపీటీసీ బ్యాలెట్ బాక్సులను తాడేపల్లిగూడెంలోని నన్నయ వర్సిటీలోని రెండో అంతస్తులోని ఓ గదిలో భద్రపరిచారు. గదికి వేసిన తాళాల బాధ్యతను ఏఆర్వోగా వ్యవహరించిన ఇరగవరం ఎంపీడీఓ ఎ.శ్రీనివాస్‌కు అప్పగించారు. అయితే ఈనెల 7న ఓట్ల లెక్కింపు సమయంలో ఎంపీడీఓ తాళాలు తీసుకురాకపోవడంతో ఆర్వో సత్యనారాయణ అన్ని పార్టీల నాయకులను పిలిపించి వారి సమక్షంలో గది తాళాలు బద్దలు కొట్టించారు. అనంతరం బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రంలోకి తీసుకువెళ్లారు. దీంతో లెక్కింపు ప్రక్రియ అర గంటకు పైగా ఆలస్యమైంది. తణుకు నియోజకవర్గంలో ఇరగవరం ఫలితాలు ఆలస్యంగా వచ్చాయి. దీంతో అభ్యర్థులు , కౌంటింగ్ ఏజెంట్లు, నాయకులు అసహనానికి గురయ్యారు. దీనిపై ఆర్వోను వివరణ కోరగా ఏఆర్వోగా ఉన్న ఎంపీడీఓ శ్రీనివాస్ తాళాల విషయంలో గందరగోళానికి గురవడంతో సంబంధిత తాళాలు తీసుకురాలేకపోయారని, దీంతో తాళం బద్దలు కొట్టాల్సి వచ్చిందని చెప్పారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పలువురు నాయకులు కోరుతున్నారు.
పోలవరం రూరల్: అఖండ గోదావరి మధ్యలోని పట్టిసం శివక్షేత్రాన్ని దర్శించే భక్తుల సౌకర్యార్థం నది దాటేందుకు ప్రత్యేక పంటును ఏ ర్పాటుచేశారు. కార్తీక మాసం ప్రారంభం కా వడంతో అధిక సంఖ్యలో భక్తులు భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి దర్శనానికి వస్తుంటా రు. ఇటీవల భారీ వర్షాలతో గోదావరిలో వర ద తగ్గుతూ పెరుగుతూ ఉంది. లాంచీల్లో త క్కువ మందిని మాత్రమే క్షేత్రానికి తరలించేవారు. పంటు ఏర్పాటుతో ఎక్కువ మందిని తరలించే అవకాశం ఉంటుంది. దీంతో ఇక్కడ లాంచీ స్థానంలో పంటును ఏర్పాటు చేశారు.
ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వచ్చే మార్చిలో జరిగే 10వ తరగతి పబ్లిక్ పరీక్షలకు ఫీజుల చెల్లింపు షెడ్యూల్ విడుదలైనట్టు ఏలూరు డీఈఓ ఎం. వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. ముందుగా హెచ్‌ఎంలు యూడైస్ వెబ్‌సైట్‌లో విద్యార్థుల వివరాలను నవీకరించి సరిచూసుకోవాలని సూచించారు. అనంతరం ఎటువంటి ఆలస్య రుసుం లేకుండా ఈనెల 11 నుంచి 25 వరకు, రూ.50 ఆలస్య రుసుంతో ఈనెల 26 నుంచి డిసెంబర్ 2 వరకు, రూ.200 రుసుంతో డిసెంబర్ 3 నుంచి 9 వరకు ఫీజులు చెల్లించవచ్చని డీఈఓ పేర్కొన్నారు.


