ముగిసిన రాష్ట్రస్థాయిచెకుముకి సంబరాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన రాష్ట్రస్థాయిచెకుముకి సంబరాలు

Nov 4 2026 2:20 AM | Updated on Nov 4 2026 2:20 AM

ముగిసిన రాష్ట్రస్థాయిచెకుముకి సంబరాలు నేడు, రేపు పాఠశాలలకు సెలవు తుపానుపై అప్రమత్తం మద్యం షాపులకు సీల్‌ రేషన్‌ పంపిణీ ఆపొద్దు

భీమవరం: స్థానిక అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో మూడు రోజులుగా జరుగుతున్న రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్‌ సంబరాలు మంగళవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమానికి జేవీవీ వ్యవస్థాపక అధ్యక్షుడు విఠపు బాలసుబ్రహ్మణ్యం, డీఈఓ అనిల్‌కుమార్‌ ముఖ్య అతిథులుగా విచ్చేసి మాట్లాడుతూ చెకుముకి సంబరాల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో పది లక్షల మంది విద్యార్థులు పాల్గొనడం అభినందనీయమన్నారు. అనంతరం విజేతలకు బహుమతులు అందించారు.

● ప్రభుత్వ పాఠశాలల విభాగం.. స్పేస్‌ సెంట్రల్‌ స్కూల్‌ (సూళ్లూరుపేట, తిరుపతి జిల్లా), పీఎంశ్రీ మోడల్‌ స్కూల్‌ (అయ్యప్ప నగర్‌, విజయనగరం), మారేడుమిల్లి జెడ్పీ హైస్కూ ల్‌ (పోలవరం జిల్లా) విద్యార్థులు మొదటి మూడుస్థానాల్లో నిలిచారు.

● ప్రైవేట్‌ పాఠశాలల విభాగం.. గుడ్‌ షెఫర్డ్‌ ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ (నంద్యాల), అమరరాజా విద్యాలయ (కరకంబాడి, తిరుపతి), రాధ స్కూల్‌ ఆఫ్‌ లెర్నింగ్‌ (సమతారాం, అనంతపురం జిల్లా) విద్యార్థులు మొదటి మూడుస్థానాల్లో నిలిచారు. విజేతలకు ప్రశంసా పత్రాలు, మెమెంటోలు, సైన్స్‌కిట్‌లు అందజేశారు. సీసీఎంబీ చీఫ్‌ సైంటిస్ట్‌ డాక్టర్‌ వేగేశ్న రాధ, నిట్‌ వరంగల్‌ ప్రొఫెసర్‌ ఎ.రామచంద్రయ్య, ప్రొఫెసర్‌ కె.లక్ష్మారెడ్డి, పొత్తూరి బాపిరాజు, జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తవ్వా సురేష్‌, జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జామాను రామ లక్ష్మణరావు, మల్లుల శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

భీమవరం: జిల్లాలో తుపాను కారణంగా వర్షాలు కురుస్తున్న దృష్ట్యా, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు బుధవారం సెలవు ప్రకటించినట్టు కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. అలాగే జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్‌ నేపథ్యంలో గురువారం ప్రభుత్వం పాఠశాలలకు సెలవు ప్రకటించామన్నారు.

పాలకొల్లు సెంట్రల్‌: మురసు తుపాను ప్రభావంతో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి సూచించారు. మంగళవారం పట్టణంలో జలమయమైన లోతట్టు ప్రాంతాలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అన్ని శాఖల అధికారులు సమ న్వయంతో సమస్యలను పరిష్కరించాలన్నారు. చెరువులు, జలాశయాలు, కాలువల వద్ద నీటి నిల్వ సామర్థ్యం, గట్ల పరిస్థితిని ఇరిగేషన్‌ అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఇంకా వర్ష సూ చనలు ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. వర్షం నీరు నిల్వ ఉండకుండా చూ డాలని మున్సిపల్‌ అధికారులకు సూచించారు. దగ్గులూరు గ్రామంలో తుపాను బాధితులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పరిశీలించారు. తహసీల్దార్‌ యడ్ల దుర్గా కిషోర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ దొడ్డా కిరణ్‌కుమార్‌, సీఐ కోలా రజనీకుమార్‌ ఉన్నారు.

భీమవరం: జిల్లాలో స్థానిక సంస్థలు ఎన్నికలు సందర్భంగా మద్యం షాపులను మంగళవారం సాయంత్రం 5 గంటల నుంచి గురువారం సాయంత్రం 5 గంటల వరకు మూసివేస్తునట్లు జిల్లా ఎకై ్సజ్‌ అధికారి తెలిపారు. డ్రై డేలో భాగంగా మద్యం షాపులకు సీల్‌ వేసినట్లు చెప్పారు.

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): చౌకధరల దుకాణాల్లో రేషన్‌ కార్డులకు మొబైల్‌ నంబర్‌ అనుసంధానం చేయకపోయినా లేదా కుటుంబ సభ్యుల ఈ–కేవైసీ ప్రక్రియ పూర్తికాకపోయినా సరుకుల పంపిణీ నిలిపివేయడానికి ప్రభుత్వం ఎ టువంటి ఆదేశాలు జారీ చేయలేదని ఏలూరు జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శివరామమూర్తి ప్రకటనలో తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement