స్థానిక ఎన్నికల ఘట్టం పతాక స్థాయికి చేరింది. నామినేషన్ల వేసిన నాటినుంచి అభ్యర్థులు ఇంటింటికి తిరిగి తమను గెలిపించాలని కోరుతూ ఓట్లు అభ్యర్థించారు. అర్నబ్, మురుసు తుపానులు అడగడుగునా ఆటంకం కలిగించినా, వాటిని లెక్కచేయకుండా జోరువానలోనూ ప్రచారం కొనసాగించారు. తొలినుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థులు ప్రచారంలో ముందంజలోనే నిలిచారు. ఈ నెల 5వ తేదీన జరగనున్న పోలింగ్‌లో విలువైన ఓట్లు ఫ్యాన్ గుర్తుకు వేసి వైఎస్సార్ సీపీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మంగళవారం ప్రచార పర్వానికి ముగింపు పలికారు. – సాక్షి నెట్‌వర్క్


