సాక్షి ప్రతినిధి, ఏలూరు: పుర పోరు తొలి అంకం ముగిసింది. జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థతో పాటు జంగారెడ్డిగూడెం, నూజివీడు మున్సిపాల్టీల్లో ఆదివారం ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మంగళవారం కౌంటింగ్ ప్రక్రియ నిర్వహించి ఫలితాలు వెల్లడించనున్నారు. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. అత్యధికంగా నూజివీడులో, అత్యల్పంగా ఏలూరులో పోలింగ్ నమోదైంది. ఏలూరు కార్పొరేషన్ పరిధిలో అధికారిక లెక్కల ప్రకారం చివరి రెండు గంటల్లో 37 వేలకు పైగా ఓట్లు పోలైనట్టు ప్రకటించారు. జిల్లాలోని మూడు మున్సిపాల్టీల్లో 130 వార్డుల్లో 3,28,671 మంది ఓటర్లకుగాను 2,02,154 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఏలూరులో స్వల్ప ఘర్షణలు మినహా..
ఏలూరు నగరంలో ఒకటి, రెండు చోట్ల స్వల్ప ఘర్షణలు మినహా ప్రశాంతంగానే పోలింగ్ ప్రక్రియ జరిగింది. ప్రధానంగా ఏలూరులో పోలింగ్ శాతం అత్యల్పంగా నమోదైంది. ఉదయం నుంచే మందకొడిగా పోలింగ్ కొనసాగింది. ఏలూరు నగరంలో 62 డివిజన్లలో 255 పోలింగ్ బూత్‌లను ఏర్పాటుచేశారు. అయితే ఉదయం 7 గంటల నుంచి మ ధ్యాహ్నం 3 గంటల వరకు సుమారు 8 గంటల పా టు 43 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. ఇక జంగారెడ్డిగూడెంలో కూడా ఇంచుమించుగా ఇదే ప రిస్థితి కొనసాగింది. నూజివీడులో మాత్రమే 70 శా తానికిపైగా పోలింగ్ నమోదైంది. ఏలూరు నగరంలో 3 గంటల నుంచి 5 గంటల మధ్య 37,344 ఓట్లు పోలయ్యాయని, దీంతో 43.84 శాతం నుంచి 59.58కి పోలింగ్ చేరింది. ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల్లో ఎక్కడా జనం పెద్దగా కనిపించకపోవడం, భారీగా ఓటు హక్కు వినియోగించుకోవడానికి బా రులు తీరలేదు. సగటున వెయ్యి ఓట్లకు ఒక బూత్‌ను ఏలూరులో ఏర్పాటుచేశారు. 2,37,256 మండి ఓటర్లు ఉండగా వారిలో 1,41,506 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరిలో పురుషులు 67,919, మహిళలు 73,564, ఇతరులు 23 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జంగారెడ్డిగూడెంలో..
జంగారెడ్డిగూడెం మున్సిపాల్టీలో 32 వార్డులో 64 పోలింగ్ కేంద్రాల్లో 48,463 మంది ఓటర్లు ఉండగా వారిలో 29,591 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 61.06 శాతం పోలింగ్ నమోదైంది.
నూజివీడులో..
నూజివీడు మున్సిపాల్టీలో 36 వార్డులో 57 పోలింగ్ కేంద్రాల్లో 42,952 మంది ఓటర్లు ఉండగా వారిలో 31,055 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో 72.30 శాతం పోలింగ్ నమోదైంది.
టీడీపీ నేతల దాడి
ఏలూరు టౌన్: ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల పోలింగ్ సందర్భంగా టీడీపీ మూకలు రెచ్చిపోయారు. నగరంలోని 55వ డివిజనల్‌లో వైఎస్సార్‌సీపీ నాయకుడు ప్రసాద్‌పై దాడికి తెగబడ్డారు. ఓడిపోతామనే భయంతో టీడీపీ కూటమి నేతల కనుసన్నల్లో దాడులు చేసినట్టు తెలిసింది. బాధితుడు ప్రసాద్ ఏలూరు జీజీహెచ్‌లో వైద్య చికిత్స పొందుతున్నారు. బాధితుడిని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ), మేయర్ అభ్యర్థి గంటా మోహనరావు, పార్టీ నాయకులు పరామర్శించి ధైర్యం చెప్పారు. తామంతా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
ఏలూరు కార్పొరేషన్‌లో చివరి రెండు గంటల్లో 15.74 శాతం పోలింగ్
మధ్యాహ్నం 3 గంటల వరకు 43.84 శాతం
నూజివీడులో అత్యధికం, ఏలూరులో అత్యల్పం
మందకొడిగా మున్సిపల్ పోలింగ్
జిల్లాలో 61.51 శాతం నమోదు
ఓటర్లలో కనిపించని ఆసక్తి


