మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మున్సిపల్‌ ఎన్నికల్లో గెలుపే లక్ష్యం

Nov 2 2026 1:35 AM | Updated on Nov 2 2026 1:35 AM

తణుకు అర్బన్‌: రానున్న మున్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి మున్సిపల్‌ చైర్మన్‌, కౌన్సిలర్ల గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులు కష్టపడి పనిచేయాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు సతీమణి లక్ష్మీకిరణ్‌ పిలుపునిచ్చారు. తణుకు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన పార్టీ ముఖ్యనేతల సమావేశంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల్లో పార్టీ క్యాడర్‌ అంతా ఎటువంటి భయం లేకుండా పోరాడి నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అన్నారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజలకు అందించిన సంక్షేమాన్ని ప్రజలకు గుర్తుచేయాలని, తణుకు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ హ యాంలోని ఐదేళ్ల కాలంలో చేసిన మంచిని ప్రజలకు తెలపాలని సూచించారు. ప్రజలకు ఇస్తానన్న హామీలతోపాటు పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు వంటివి ప్రజల దృష్టికి తీసుకువెళ్లాలని సూచించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఐదేళ్ల పాలనలో పేదలకు సంక్షేమాన్ని ఇంటి గుమ్మంలోకి తీసుకువెళ్లిన విధానాలను ప్రజలు మరచిపోరని స్పష్టం చేశారు. ము న్సిపల్‌ ఎన్నికలకు సంబంధించి కార్యాచరణపై పార్టీ నాయకులతో చర్చించారు. పార్టీ పట్ణణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, లీగల్‌ సెల్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, పంచాయతీరాజ్‌ వింగ్‌ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు యిండుగపల్లి బలరామకృష్ణ, మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి చోడే గోపీకృష్ణ, ఎస్సీసెల్‌ రాష్ట్ర కార్యదర్శి పొట్ల సురేష్‌, సీనియర్‌ న్యాయవాది బలిజేపల్లి రవిశంకర్‌, పట్టణ మహిళాధ్యక్షురాలు నూకల కనకదుర్గ, ఝాన్సీ లారెన్స్‌, బెజ్జవరపు హేమశ్రీ, షేక్‌ ఫహీమా తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement