భీమవరం : విజ్ఞానం ద్వారానే సమాజం అభివృద్ధి చెందుతుందని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు అన్నారు. ఆదివారం స్థానిక అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో రాష్ట్రస్థాయి చెకుముకి సైన్స్ సంబరాలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రజ ల్లో శాస్త్ర విజ్ఞానాన్ని ప్రచారం చేస్తున్న జన విజ్ఞాన వేదికను అభినందించారు. శాసీ్త్రయ దృక్పథాన్ని విద్యార్థులు అలవర్చుకోవాలని అన్నా రు. జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు కేఎస్ లక్ష్మణరావు, ఎమ్మెల్సీ బి.గోపిమూర్తి, వేగేశ్న రాధ, నక్కా వెంకటేశ్వర్లు, జిల్లా కన్వీనర్ రేపాక వెంకన్నబాబు తదితరులు పాల్గొన్నారు.
పెనుగొండ : అర్నబ్ తుపాను వ్యవసాయ, ఉద్యాన పంటలకు తీవ్ర నష్టం వాటిల్లడంతో పాటు పంట పొలాల్లో నీరు నిలిచిపోయిన నేపథ్యంలో కేంద్ర బృందం ఆదివారం పెనుగొండ మండలంలో పర్యటించింది. వడలి గ్రామంలో పంట పొలాలను కేంద్ర బృందం పరిశీలించింది. పొలాల్లో నిలిచిపోయిన నీటిని, దెబ్బతిన్న పంటలను పరిశీలించి స్థానిక రైతులతో మా ట్లాడింది. క్షేత్రస్థాయిలో పంట నష్టాలను పరిశీలించి సంబంధిత వివరాలను సేకరించింది. అడిషనల్ కమిషనర్ రాహుల్‌కుమార్‌రెడ్డి, ఆర్డీఓ దాసి రాజు, జిల్లా వ్యవసాయ అధికారి సునీత, మండల వ్యవసాయ అధికారి పి.స్పందన, తహసీల్దార్ జి.అనిత కుమారి, ఎంపీడీఓ టి.సూర్యనారాయణమూర్తి ఉన్నారు.
తుపాను నష్టాలపై సమీక్ష
భీమవరం (ప్రకాశంచౌక్): స్థానిక కలెక్టరేట్‌లో ఏర్పాటుచేసిన అర్నబ్ తుపాను ఫొటో ప్రదర్శనను కేంద్ర బృంద సభ్యులు కలెక్టర్ సీహెచ్ నాగరాణితో కలిసి పరిశీలించారు. తుపాను ప్రభావం, జిల్లాలో జరిగిన నష్టం, సహాయక చర్యలు, పునరుద్ధరణకు సంబంధించిన ఫొటోలను చూపించి కలెక్టర్ కేంద్ర బృందానికి నష్టాన్ని వివరించారు. అనంతరం పవర్ పా యింట్ ప్రజెంటేషన్ ద్వారా జిల్లాలో వివిధ రంగాలకు జరిగిన నష్టం, బాధిత కుటుంబాల వివరాలు, జిల్లా యంత్రాంగం చేపట్టిన ముందస్తు చర్యలు, సహాయక కార్యక్రమాలు, పునరుద్ధరణ పనుల పురోగతిని కేంద్ర బృందానికి తెలియజేశారు. జిల్లాలో సుమారు 4,603 ఇళ్లు దెబ్బతిన్నాయని, 57,999 కుటుంబాలు ప్రభావితమయ్యాయన్నారు. మొత్తంగా 1,99,554 ఎకరాల వ్యవసాయ పంటలు దెబ్బతిన్నట్టు ప్రాథమిక నివేదికలో వెల్లడైందని వివరించారు.
తాడేపల్లిగూడెం (రూరల్): స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణ, ప్ర జల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం, ఎ న్నికలు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా పోలీసులు ఫ్లాగ్‌మార్చ్ నిర్వహించారు. ఆదివారం తాడేపల్లిగూడెం రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జగన్నాథపురం, మాధవరం, కడియద్దలో సబ్ డివిజినల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్‌డీపీఓ) నరసింహరావు ఆధ్వర్యంలో మా ర్చ్ జరిగింది. ఆయనతో పాటు సీఐ డి.శ్రీనివాస్‌రావు, ఎస్సై ఎస్.రవికుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని ప్రజలకు సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
వీరవాసరం : పశ్చిమగోదావరి జిల్లా స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో స్కూల్‌గేమ్స్ అండర్ 14, 17 బాలబాలికల రైఫిల్ షూటింగ్ జిల్లా జట్ల ఎంపికలు మంగళవారం భీమవరం చింతలపాటి బాపిరాజు మున్సిపల్ హైస్కూ ల్‌లో నిర్వహించనున్నట్టు స్కూల్‌గేమ్స్ కార్యదర్శులు గుత్తుల నర్మద, మహమ్మద్ ఖుద్ధుస్ ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఉదయం 10 గంటలకు రిపోర్ట్ చేయాలని వారు సూచించారు.


