నామినేషన్ల జాతర | - | Sakshi
Sakshi News home page

నామినేషన్ల జాతర

Oct 19 2026 1:37 AM | Updated on Oct 19 2026 1:37 AM

సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి జిల్లాలో పుర పోరు కీలకఘట్టానికి చేరింది. ఆదివారం నామినేషన్ల స్వీకరణ తుది గడువు కావడంతో నామినేషన్ల జాతర కొనసాగింది. ఏలూరు నగరపాలక సంస్థతోపాటు ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాలో నూజివీడు, జంగారెడ్డిగూడెం, నరసాపురం మున్సిపాలిటీలతోపాటు ఆకివీడు నగర పంచాయతీకి ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 16న ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆదివారంతో ముగిసింది. మొత్తంగా 5 మున్సిపాలిటీల్లోని వార్డులకు కలిపి అధికార, ప్రతిపక్ష పార్టీలతో సహా 946 నామినేషన్లు వేశారు. ఇక ఏలూరులో కూటమి పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించిన మే యర్‌ స్థానంలో పోటీగా టీడీపీ అభ్యర్థి రెడ్డి నా గరాజు నామినేషన్‌ దాఖలు చేశారు. అలాగే జంగారెడ్డిగూడెం టీడీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థి అనూషపై రెబల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా మారిశెట్టి బాలచిట్టెమ్మ నామినేషన్‌ దాఖలు చేశారు.

నేడు నామినేషన్ల పరిశీలన

మున్సిపల్‌ ఎన్నికల నామినేషన్‌ స్వీకరణ ప్రక్రియ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. సోమవారం నామినేషన్ల పరిశీలన, బుధవారం ఉపసంహరణ కార్యక్రమం నిర్వహించి 28న పోలింగ్‌, 30న కౌంటింగ్‌ నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏలూరు నగర పాలక సంస్థలో 62 డివిజన్ల నుంచి 343 నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధానంగా 117 సెట్లు వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు దాఖలు చేయగా టీడీపీ 110, జనసేన 46, బీజేపీ 10 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు. ఏలూరు మేయర్‌ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ తరఫున గంటా మోహనరావు (జీఎంఆర్‌), కూటమి అభ్యర్థిగా జనసేన నేత రెడ్డి అప్పలనాయుడు, కూటమి మేయర్‌ రెబల్‌ అభ్యర్థిగా టీడీపీ నేత రెడ్డి నాగరాజు ప్రస్తుతం పోటీలో నిలిచారు. అలాగే నూజివీడు మున్సిపాలిటీలోని 36 వార్డులకుగాను 160 సెట్లు నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్‌సీపీ 69, టీడీపీ 61, జనసేన 17 నామినేషన్‌ సెట్లు దాఖలు చేశాయి. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా వైఎస్సార్‌సీపీ నుంచి కంచర్ల లవకుమార్‌, టీడీపీ నుంచి బర్రె ఇళయరాజా నామినేషన్లు దాఖలు చేశారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలోని 32 వార్డుల నుంచి 152 నామినేషన్‌ సెట్లు దాఖలు కాగా, వైఎస్సార్‌సీపీ నుంచి 60, టీడీపీ 55, జనసేన నుంచి 20 సెట్లు దాఖలయ్యాయి. వైఎస్సార్‌సీపీ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా మేకా సత్యవతి, టీడీపీ అభ్యర్థిగా రొంగల అనూష, టీడీపీ రెబల్‌ అభ్యర్థిగా మారిశెట్టి బాలచిట్టెమ్మ బరిలో నిలిచారు.

పశ్చిమలో..

పశ్చిమగోదావరి జిల్లాలో నరసాపురం మున్సిపాలిటీ నుంచి 36 వార్డుల్లో 164 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్‌సీపీ చైర్‌పర్సన్‌ అభ్యర్థిగా కావలి రామసీత, కూటమి అభ్యర్థిగా జనసేన నుంచి కొత్తపల్లి శైలజలు నామినేషన్లు వేశారు. అలాగే ఆకివీడు నగర పంచాయితీలోని 28 వార్డుల నుంచి 127 సెట్ల నామినేషన్లు దాఖలయ్యాయి. వైఎస్సార్‌సీపీ నుంచి 47 సెట్లు, జనసేన 17, టీడీపీ 40 సెట్లు నామినేషన్లు దాఖలు చేశారు.

ఏలూరు జిల్లాలో 130 వార్డుల్లో ఎన్నికలు

ఏలూరు జిల్లాలోని ఏలూరు నగరపాలక సంస్థ, నూజివీడు, జంగారెడ్డిగూడెంలోని 130 వార్డుల్లో ఈనెల 28న ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా 376 పోలింగ్‌ కేంద్రాలను ఎంపిక చేశారు. వీటిలో 297 పోలింగ్‌ కేంద్రాలు సాధారణమైనవిగాను 46 సమస్యాత్మక కేంద్రాలుగా 33 పోలింగ్‌ కేంద్రాలు అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించి ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా జిలాఈ్ల అధికా రులు ఏర్పాట్లు చేస్తున్నారు.

పుర పోరులో కీలక ఘట్టం పూర్తి

ఏలూరులో అత్యధికంగా 343 నామినేషన్లు

నరసాపురంలో 164, జంగారెడ్డిగూడెంలో 152..

ఆకివీడులో 127,నూజివీడులో 160 నామినేషన్లు

ఏలూరులో టీడీపీ రెబల్‌ మేయర్‌ అభ్యర్థి నామినేషన్‌

జంగారెడ్డిగూడెంలో టీడీపీ రెబల్‌ అభ్యర్థినిగా బాలచిట్టెమ్మ బరిలో..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement