బాణసంచా దుకాణాల వద్ద భద్రత తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

బాణసంచా దుకాణాల వద్ద భద్రత తప్పనిసరి

Oct 19 2026 1:37 AM | Updated on Oct 19 2026 1:37 AM

భీమవరం: దీపావళి బాణసంచా దుకాణాల వద్ద భద్రతా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని జిల్లా అగ్నిమాపక శాఖాధికారి బి.శ్రీనివాసరావు ఆదివారం తెలిపారు. కొత్తగా సవరించిన పేలుడు పదార్థాల నిబంధనల ప్రకారం భద్రతా చర్యలు అమలు చేయాలన్నారు. ప్రతి దుకాణానికి ప్రవేశ ద్వారం, అత్యవసర నిష్క్రమణ ద్వారాలు తప్పనిసరి అని, షాపు స్వతంత్రంగా గ్రౌండ్‌ ఫ్లోర్‌లో ఏర్పాటుచేయాలన్నారు. దుకాణంలో డ్రై కెమికల్‌ పౌడర్‌, కార్బన్‌ డయాకై ్సడ్‌ రకాలకు చెందిన కనీసం రెండు అగ్నిమాపక పరికరాలు ఏర్పాటు చేయాలని, కొత్తగా ఏర్పాటు చేసే స్వతంత్ర బాణసంచా దుకాణాలకు పక్కనున్న నిర్మాణాల నుంచి కనీసం మూడు మీటర్ల ఖాళీ ప్రదేశం ఉండాలన్నారు. విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వైద్య నిర్ధారణ కేంద్రాలు, ప్రార్థనా స్థలాల నుంచి కనీసం 50 మీటర్ల దూరం పాటించాలన్నారు. ఇప్పటికే ఉన్న బాణసంచా దుకాణాల్లో ఆటోమేటిక్‌ అగ్ని గుర్తింపు, అలారం వ్యవస్థలు, ఆటోమేటిక్‌ నీటి స్ప్రింక్లర్‌ వ్యవస్థలు, అవసరమైన నీటి నిల్వ, పంపు, ప్రత్యామ్నాయ విద్యుత్‌ లేదా బ్యాటరీ బ్యాకప్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్యుత్‌ ప్యానెల్స్‌కు ఆటోమేటిక్‌ అగ్ని నివారణ వ్యవస్థలు ఏ ర్పాటు గోడలు, పైకప్పు, తలుపులకు అగ్ని నిరోధక పూత వేసి భద్రతా ప్రమాణాలకు అనుగుణమైన విద్యుత్‌ వైరింగ్‌ ఏర్పా టు చేసుకోవాలన్నారు. అదనపు భద్రతా చర్యలకు సంబంధించి లైసెన్సింగ్‌ అథారిటీ కోరిన హామీ పత్రాన్ని నిర్దేశించిన గడువులోగా సమర్పించాలని స్పష్టం చేశారు. దరఖాస్తుదారులు కలెక్టర్‌ లేదా లైసెన్సింగ్‌ అథారిటీకి దరఖాస్తు చేసిన అనంతరం సంబంధిత అథారిటీ జారీ చేసే మెమొరాండం ఆధారంగా అగ్నిమాపక శాఖ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. అన్ని ప్రమా ణాలు పాటించినట్టు నిర్ధారణ అయితేనే భద్రతా సిఫార్సు నివేదిక, తనిఖీ నివేదిక జారీ చేస్తారని శ్రీనివాసరావు వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement