52 వార్డులుగా భీమవరం | - | Sakshi
Sakshi News home page

52 వార్డులుగా భీమవరం

Oct 19 2026 1:37 AM | Updated on Oct 19 2026 1:37 AM

52 వార్డులుగా భీమవరం తణుకులో 44 వార్డులు 25న సాహితీ ఉత్సవం బాలిక అదృశ్యంపై కేసు

భీమవరం (ప్రకాశంచౌక్‌): భీమవరం మున్సిపాలిటీని 52 వార్డులుగా విభజిస్తూ డైరెక్టర్‌ ఆఫ్‌ మున్సిపల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ కమిషనర్‌ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ను విడుదల చేశారు.

వార్డుల విభజన ఇలా..

● 1 నుంచి 10 వార్డులు : యనమదుర్రు డ్రె యిన్‌, భీమవరం–నిడదవోలు రైల్వేలైన్‌, గునుపూడి గ్రామం, ఏఎస్‌ఆర్‌ బొమ్మ జంక్షన్‌, శ్రీలంక రోడ్‌, పీపీ రోడ్‌, కనకదుర్గ గుడి ప్రాంతాలు, జీఅండ్‌వీ కెనాల్‌ పరిసరాలు, రైల్వేస్టేషన్‌ రోడ్డు ప్రాంతాలను కలుపుతూ సరిహద్దులు నిర్ణయించారు.

● 11 నుంచి 20 వార్డులు: గునుపూడి డ్రెయిన్‌, తాడేరు సరిహద్దులు, మిషన్‌ హాస్పిటల్‌ రోడ్‌, రాజీవ్‌ గాంధీ విగ్రహ ప్రాంతాలు, సోమేశ్వరస్వామి ఆలయం, గునుపూడి ఆంజనేయులు వీధి, పశుపులేటి వారి వీధి, రైతబజార్‌ రోడ్డు, పామర్రు రోడ్డు పరిసరాలు.

● 21 నుంచి 30 వార్డులు : ఆర్టీసీ కాంప్లెక్స్‌ తూర్పువైపు రోడ్డు, గూడ్స్‌ షెడ్‌ రోడ్‌, మోటుపల్లివారి వీధి, బస్టాండ్‌ రోడ్డు, రెస్ట్‌హౌస్‌ రోడ్‌, మున్సిపల్‌ ఆఫీస్‌ రోడ్‌, తాతవర్తి వారి వీధి, కటారివారి వీధి, ఎరగ్రుంట వారి వీధి, బేతనిపేట రోడ్డు ప్రాంతాలు.

● 31 నుంచి 40 వార్డులు: ఎస్‌పీ స్ట్రీట్‌, డేగల వారి వీధి, చినపేట రోడ్డు, డీఎన్నార్‌ కాలే జీ రోడ్డు, కొమరాడ రోడ్డు, జేపీ రోడ్డు, రా య లం రోడ్డు, నాయుడుగారి సెంటర్‌, బలుసు మూడి మావుళ్లమ్మ గుడి వీధి ప్రాంతాలు.

● 41 నుంచి 52 వార్డులు: అనాకోడేరు కెనాల్‌, ఎస్‌ఆర్‌కేఆర్‌ కాలేజ్‌, అంబేడ్కర్‌ సెంటర్‌, చినఅమిరం సరిహద్దులు, యనమదుర్రు కె నాల్‌ సెంటర్‌ లైన్‌, ఉండి రోడ్డు, తాడేపల్లిగూడెం రోడ్డు, భీమవరం మున్సిపల్‌ సరిహద్దుల్లో వివిధ సర్వే నంబర్ల ప్రాంతాలు.

తణుకు అర్బన్‌: తణుకు మున్సిపాలిటీలో వార్డుల సంఖ్యను 34 నుంచి 44గా పునర్విభజన చేస్తూ మున్సిపల్‌ పరిపాలన శాఖ గెజిట్‌ విడుదల చేసింది. పట్టణంలో 44 వార్డులుగా విభజిస్తున్నట్లుగా ముసాయిదాను ఈనెల 7న తణుకు పురపాలక సంఘం విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిపై 14లోపు అభ్యంతరాలు తెలియచేయాలని మున్సిపల్‌ కమిషనర్‌ టి.రామ్‌కుమార్‌ ప్రకటన విడుదల చేశా రు. దీనికి సంబంధించి 20 వరకు అభ్యంతరా లు రాగా పరిశీలన చేసి తుది నిర్ణయాన్ని ము న్సిపల్‌ పరిపాలన శాఖ ఆమోదం కోసం పంపించారు. ఈ నేపథ్యంలో విడుదలైన గెజిట్‌కు అనుగుణంగా సరిహద్దులు ఖరారు చేయడంతో వార్డుల వారీగా ఈనెల 24న ఫొటోలతో ఉన్న ఓటర్ల తుది జాబితాను విడుదల చేయా ల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన జారీ చేసినట్టు అధికారులు తెలిపారు.

భీమవరం : భీమవరం ఎస్‌ఆర్‌కేఆర్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో గోదావరి సాంస్కృతిక వేదిక ఆధ్వర్యంలో ఈనెల 25న సాహితీ ఉత్సవం నిర్వహించనున్నట్టు సంస్థ అధ్యక్ష, కార్యదర్శులు కూనపరాజు కుమార్‌, పి.శ్రీనివాస రాజు ఆదివారం ప్రకటనలో తెలిపారు. సినీ ద ర్శక, రచయిత వంశీ, వాగ్గేయకారుడు గోరాటి వెంకన్న ముఖ్య అతిథులుగా హాజరవుతారన్నారు. కథ, నవల, కవిత, గేయం అనే ప్రక్రియలో ఉపన్యాసాలు, సంభాషణలు, ఇష్టాగోష్టులు నిర్వహిస్తామన్నారు. అనంతరం గోదా వరి అలలు కథల, కవితల సంకలన పుస్త కావిష్కణ ఉంటుందని పేర్కొన్నారు.

ఉండి: ఉండిలో బాలిక అదృశ్యంపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆకివీడుకు చెందిన 17 ఏళ్ల బాలిక తల్లి గల్ఫ్‌ దేశంలో ఉండ టంతో ఆమె ఉండిలో చిన తాత ఇంటి వద్ద ఉంటూ ఇంటర్‌ చదువుతోంది. ఈనెల 14న నుంచి ఆమె కనిపించకపోవడంతో గా లించినా ఆచూకీ తెలియరాలేదు. దీనిపై హెడ్‌ కానిస్టేబుల్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement