ప్రశాంత ఎన్నికలకు ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

ప్రశాంత ఎన్నికలకు ఏర్పాట్లు

Oct 19 2026 1:37 AM | Updated on Oct 19 2026 1:37 AM

ఆకివీడు: ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎన్నికల సాధారణ పరిశీలకులరాలు బి.నవ్య తెలిపారు. స్థానిక స్థానిక నగర పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ల దాఖలు, సౌకర్యాల్ని ఆదివారం ఆమె పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడు తూ నగర పంచాయతీలోని 28 వార్డులకు నామినేషన్ల దాఖలు ఘట్టం పూర్తయిందన్నారు. పోలింగ్‌ కేంద్రాల్ని వ్యయ పరిశీలకుడు అబ్దుల్‌ రవూఫ్‌ షేక్‌తో కలిసి పరిశీలించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాట్లు పక్కాగా ఉండాలన్నారు. సోమవారం నామినేషన్ల పరిశీలన ఉంటుందని, 21న మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉందన్నారు. 28న పోలింగ్‌, 30న కౌంటింగ్‌కు ఏర్పాట్లు చేశారన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. వ్యయ పరిశీలకుడు రావూఫ్‌ షేక్‌ మాట్లాడుతూ అభ్యర్థులు ఎన్నికల నిబంధనలకు అనుగుణంగా ఎ న్నికల వ్యయం చేపట్టాలన్నారు. జేసీ కల్పశ్రీ, ఆర్డీఓ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, అదనపు ఎస్పీ, డీఎస్పీ రఘువీర్‌ విష్ణు, కమిషనర్‌ కృష్ణమోహన్‌, తహసీల్దార్‌ దర్శి వంశీ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement