పోలవరంలో ముగిసిన విదేశీ నిపుణుల పర్యటన | - | Sakshi
Sakshi News home page

పోలవరంలో ముగిసిన విదేశీ నిపుణుల పర్యటన

Oct 18 2026 1:18 AM | Updated on Oct 18 2026 1:18 AM

పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్టులో అంతర్జాతీయ నిపుణుల నాలుగు రోజుల పర్యటన ముగిసింది. ఈనెల 14 నుంచి 17 వరకు ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించిన నిపుణులు.. కీలకమైన ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ (ఈసీఆర్‌ఎఫ్‌) డ్యామ్‌ నిర్మాణ పనులు, నాణ్యతా నియంత్రణ పరీక్షలను పరిశీలించారు. గ్యాప్‌–1, 2 నిర్మాణాల పురోగతిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు. నిర్మాణ నాణ్యత, పరీక్షల నిర్వహణ తీరుపై సంతృప్తి వ్యక్తం చేశారు. నాలుగు రోజుల పర్యటనలో మొత్తం 40 గంటలపాటు ప్రాజెక్టు పనులపై దృష్టి సారించిన నిపుణులు.. 13 గంటలు క్షేత్రస్థాయి పరిశీలనకు, 27 గంటలు సమీక్షా సమావేశాలకు కేటాయించారు. రిచర్డ్‌ డొనెల్లీ, గ్లాన్‌ఫ్రాంకో డి సిక్కో, సీన్‌ హించ్‌బెర్గర్‌, డేవిడ్‌ పాల్‌ ఈ పర్యటనలో పాల్గొన్నారు. నాలుగు రోజుల పాటు జరిగిన సమీక్షా సమావేశాలకు వోహ్రా అధ్యక్షత వహించారు.

నాణ్యతలో రాజీ వద్దు

పర్యటన చివరి రోజైన శనివారం ఉదయం 9 గంటలకు ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న నిపుణులు.. పీపీఏ, రాష్ట్ర జలవనరుల శాఖ, ఎంఈఐఎల్‌ ప్రతినిధులతో సమావేశమయ్యారు. తొలి మూడు రోజుల పర్యటనలో పరిశీలించిన అంశాలను వివరించారు. అనంతరం పీపీఏ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై తమ పరిశీలనలోని కీలక అంశాలను తెలియజేశారు. విదేశీ నిపుణుల పర్యటనను పీపీఏ సీఈఓ సంజీవ్‌ వోహ్రా, రాష్ట్ర జలవనరుల శాఖ ఈఎన్‌సీ కె. నరసింహమూర్తి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement