న్యాయవాదులకు అండగా నిలవాలి | - | Sakshi
Sakshi News home page

న్యాయవాదులకు అండగా నిలవాలి

Sep 11 2026 11:03 AM | Updated on Sep 11 2026 11:03 AM

ఏలూరులో వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ భారీ సమావేశం

ఏలూరు టౌన్‌ : రాష్ట్రంలో న్యాయవాదుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం అందరూ ఐక్యంగా పోరాడాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. ఏలూరు లేడీస్‌ క్లబ్‌లో జరిగిన ఏలూరు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ లీగల్‌ సెల్‌ సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ కూటమి నేతలు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా న్యాయవాదులను నిరాశకు గురిచేశారని విమర్శించారు. ముఖ్యంగా జూనియర్‌ న్యాయవాదులు వృత్తిలో స్థిరపడే దశలో ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. గత జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వ హయాంలో శ్రీవైఎస్సార్‌ లా నేస్తంశ్రీ ద్వారా నెలకు రూ.5 వేల ఆర్థిక సహాయం అందించి జూనియర్లకు భరోసా కల్పించామని గుర్తుచేశారు.

అడ్వకేట్స్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌ను అమలు చేయాలి

ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్‌ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే న్యాయవాదులకు నెలకు రూ. 10 వేలు ఆర్థిక సహాయం ఇస్తామన్న హామీని విస్మరించడం సరికాదన్నారు. న్యాయవాదుల భద్రత కోసం శ్రీఅడ్వకేట్స్‌ ప్రొటెక్షన్‌ యాక్ట్‌శ్రీను వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. లీగల్‌ సెల్‌ జిల్లా అధ్యక్షుడు సీహెచ్‌ రాజేంద్రప్రసాద్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రామాంజనేయులు, అధికార ప్రతినిధి మున్నుల జాన్‌గురునాథ్‌, సీనియర్‌ న్యాయవాదులు సుధీర్‌మాస్టర్‌, బి. జగన్నాధరెడ్డి, అచంట వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత విస్తరించాలని, నిధులు కేటాయించాలని కోరారు. న్యాయవాదుల కుటుంబాలకు మెరుగైన ఆరోగ్య, సామాజిక భద్రత కల్పించే బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్‌సీపీ లీగల్‌సెల్‌ ముఖ్యనేతలు వీ లక్ష్మీకుమార్‌, ఎం.వాసుదేవరావు, ఎం.రాజేంద్ర, స్టాన్లీబాబు, తుమరాడ స్రవంతి, ఇనపనూరి కేదారేశ్వరి, అల్తి శ్రీనివాసరావు, జే. సురేష్‌రెడ్డి, ఓ.సుజాత, విశాల్‌, జ్యోతి, కొండా యశ్వంత్‌, మధు, ఎం.రవి, పండుబాబు, భారీ సంఖ్యలో న్యాయవాదులు హాజరయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement