ఆకివీడు: స్థానిక సరోజినీ నాయుడు బాలికోన్నత పాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థినులు, రాష్ట్ర స్థాయిలో ఈ నెల 24న తిరుపతిలో జరిగే అమరావతి కప్ పోటీలకు ఎంపికయ్యారు. వాలీబాల్ పోటీల్లో ఏ మేఘన, జే. నిత్య కృష్ణశ్రీ, అండర్–17 కబడ్డీ పోటీల్లో సీహెచ్ మేరీ గ్రేస్ పాల్గొంటారని ప్రధానోపాధ్యాయురాలు ఇందిర, పీడీ ఎం.రామలక్ష్మి తెలిపారు. మండలంలోని చినకాపవరం జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన ఇద్దరు విద్యార్థినులు కే చిట్టిమేరి, టీ వేద సువర్ణ బాస్కెట్‌బాల్ పోటీల్లో పాల్గొంటారని ప్రధానోపాధ్యాయుడు కే. శ్రీనివాస్, వ్యాయామ ఉపాధ్యాయుడు షేక్ అహ్మద్ ఆలీ తెలిపారు. అలాగే, స్థానిక జెడ్పీ బాలురోన్నత పాఠశాల నుంచి విద్యార్థిని జీ. హంసిక కబడ్డీ పోటీలకు ఎంపికయ్యారని హెచ్‌ఎం పారనాయుడు తెలిపారు.


