ఆ తరువాత కూటమి ప్రభుత్వంలో ఉపాధిహామీ పథకం కింద శ్లాబ్ కల్వర్టు నిర్మాణంతో పాటు సీసీ రోడ్లు నిర్మాణానికి గాను రూ.35 లక్షలు మంజూరు కాగా గృహనిర్మాణశాఖ మంత్రి ఈ ఏడాది ఫిబ్రవరి 28న పనులకు శంకుస్థాపన చేశారు. అయితే ఇంత వరకు పనులు ప్రారంభించలేదు. కాంట్రాక్టర్ పనులు ప్రారంభించకుండా జాప్యం చేస్తున్నప్పటికీ ప్రజాప్రతినిధులు గాని, అధికారులు కూడా ఏమాత్రం పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ మార్గంలో రైతులు వ్యవసాయ భూముల్లోకి వెళ్లాలన్నా, పచ్చగడ్డి కోసుకొని ద్విచక్ర వాహనాలపై తెచ్చుకోవాలన్నా, ట్రాక్టర్లు రాకపోకలు సాగించాలన్నా ప్రతిరోజూ దినదినగండగా రాకపోకలు సాగిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాకుండా పశువులు, జీవాలు పొలాల్లోకి మేతకోసం వెళ్లేటప్పుడు, వచ్చేటప్పుడు లోతుగా ఉన్న వాగులో పడిపోతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికై నా శ్లాబ్కల్వర్టు నిర్మాణం చేపట్టి ఇబ్బందులను తొలగించాలని గ్రామస్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.


