పోలవరం రూరల్ : గోదావరి పరీవాహక ప్రాంతంలోని ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి చేరుతున్న వరద నీరు తగ్గుముఖం పట్టడంతో నదీ ప్రవాహం క్రమేపీ తగ్గుతోంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో వర్షాలు లేకపోవడంతో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 27 మీటర్లకు చేరుకుంది. స్పిల్‌వే మీదుగా 80 వేల క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. ఎగువ నుంచి వచ్చే ఇన్‌ఫ్లోలు తగ్గడంతో రాబోయే గంటల్లో వరద మరింత తగ్గే అవకాశం ఉంది.


