నేటి నుంచి ప్రాతఃకాల ప్రదక్షిణలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి ప్రాతఃకాల ప్రదక్షిణలు

Jul 13 2026 4:37 AM | Updated on Jul 13 2026 4:37 AM

నేటి నుంచి ప్రాతఃకాల ప్రదక్షిణలు నేడు యథావిధిగా పీజీఆర్‌ఎస్‌ చినవెంకన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి సీఎం పర్యటనకు పటిష్ట భద్రత

పాలకొల్లు సెంట్రల్‌: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం మాసశివరాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రధానార్చకులు సన్నిదిరాజు కృష్ణారావు మాట్లాడుతూ సోమవారం, మాసశివరాత్రి, ఆరుద్ర నక్షత్రం కలిసి రావడం అరుదని అన్నారు. ప్రతి సోమవారం ఆలయంలో సప్త మారేడు దళాలతో ఏడు ప్రదక్షిణలు, ఏడు సోమవారాలు చేయనున్నట్టు చెప్పారు. ఈ సోమవారం పర్వదినాన్ని పురస్కరించు కుని ప్రాతఃకాల సమయంలో (ఉదయం 6.30 గంటలకు) స్వామివారి అభిషేకం పూర్తయిన అనంతరం సప్త ప్రదక్షిణలు ప్రారంభించనున్నట్టు చెప్పారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్‌) కార్యక్రమం సో మవారం జిల్లా కలెక్టరేట్‌తో పాటు డివిజన్‌, మండల కేంద్రాల్లో నిర్వహించనున్నట్టు కలెక్టర్‌ సీహెచ్‌ నాగరాణి తెలిపారు. అలాగే రెవెన్యూ సమస్యల పరిష్కారం కోసం రెవెన్యూ క్లినిక్‌ కా ర్యక్రమం కూడా నిర్వహిస్తామన్నారు. ప్రజలు ఆన్‌లైన్‌లోనూ అర్జీలు నమోదు చేసుకోవచ్చని, టోల్‌ఫ్రీ నంబర్‌ 1100ను సంప్రదించవచ్చని ఆమె సూచించారు. ముఖ్యంగా నడవలేని, మ ంచానికే పరిమితమైన, తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న వారిని పీజీఆర్‌ఎస్‌ కేంద్రా ల వద్దకు తీసుకురావద్దని, అలాంటి వారి సమస్యలను కుటుంబ సభ్యులు లేదా ప్రతినిధుల ద్వారా తెలియజేయవచ్చని పేర్కొన్నారు. అలాగే ప్రతి శుక్రవారం నియోజకవర్గస్థాయిలో నిర్వహిస్తున్న ప్రత్యేక పీజీఆర్‌ఎస్‌ కార్యక్రమాలను కూడా సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బాలాజీ మెడమల్లి ఆదివారం కుటుంబసమేతంగా సందర్శించారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వా గతం పలికారు. ఆలయ ప్రదక్షిణల అనంతరం ఆయన శ్రీవారు, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. న్యాయమూర్తికి అర్చకులు స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనం అందించారు. దేవస్థానం ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు చినవెంకన్న చిత్రపటంతో పాటు ప్రసాదాలను అందజేశారు. భీమడోలు కోర్టు జడ్జి ఎస్‌.ప్రియదర్శిని నూతక్కి, ఆలయ సూపరింటెండెంట్‌ ఐవీ రామారావు ఉన్నారు.

పోలవరం రూరల్‌: ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్టు ఏలూరు రేంజ్‌ ఐజీ జీవీజీ అశోక్‌కుమార్‌ తెలిపారు. పోలవరం ఆదివారం అధికారులతో సమావేశం నిర్వహించి సూచనలిచ్చారు. రూట్‌ బందోబస్తు, రూఫ్‌టాప్‌ భద్రత, ప్రధాన కూడళ్లలో మూవబుల్‌ బ్యారికేడ్ల ఏర్పాటు, ట్రాఫిక్‌ నియంత్రణ, పార్కింగ్‌ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వర్షాకాల పరిస్థితుల దృష్ట్యా సిబ్బంది అంతా రెయిన్‌కోట్లు, గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలని, విధుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం కాన్వాయ్‌ ట్రయల్‌రన్‌ నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్‌) వై.ప్రసాదరావు, డీఎస్పీలు శ్రావణ్‌కుమార్‌, ప్రసాద్‌, ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్‌ మల్లేశ్వరరావు, పోలవరం ఇన్‌స్పెక్టర్‌, ఎస్సై అప్పారావు తదితరులు పా ల్గొన్నారు. ఇదిలా ఉండగా మధ్యాహ్నం 1:20 నిమిషాలకు సీఎం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు పనులను పరిశీలించిన అనంతరం అధికారులతో సమావేశం నిర్వహిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement