తణుకు అర్బన్: రోల్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ అంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో శనివారం తణుకులో జరిగిన రోల్ బాల్ జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో 8 మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వి.లావణ్య తెలిపారు. ఎంపికలకు 18 మంది క్రీడాకారులు హాజరుకాగా అండర్ 14 విభాగంలో ఆర్.గగన్‌దీప్, కె.యశ్వంత్, జి.భువన్, వి.వీహాస్, అండర్ 17 విభాగంలో జి.రంజిత్, కె.అఖిల్, ఎం.తనిష్క్, ఎన్.శరత్‌రావు ఎంపికై నట్లు చెప్పారు. ఈనెల 24 నుంచి 26 తేదీల్లో గుంటూరులో జరిగే రోల్ బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు వీరు పశ్చిమ గోదావరి జిల్లా తరుఫున ఆడనున్నారని వివరించారు.


