పుస్తకాల్లేని చదువులు | - | Sakshi
Sakshi News home page

పుస్తకాల్లేని చదువులు

Jul 12 2026 3:41 AM | Updated on Jul 12 2026 3:41 AM

పాఠశాలలు తెరిచి నెల రోజులు గడిచినా...

ఆందోళన వద్దు

ప్రస్తుత విద్యాసంవత్సరం గత నెల 12వ తేదీన ప్రారంభమైనప్పటికీ, నేటికీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్య, నోట్‌ పుస్తకాలను అందించలేదు. గత జగన్‌ ప్రభుత్వ హయాంలో పాఠశాలలు తెరిచిన రోజే పాఠ్య, నోట్‌ పుస్తకాలతో పాటు స్కూల్‌ బ్యాగ్‌, షూస్‌, సాక్స్‌, టై, బెల్ట్‌, యూనిఫామ్‌ వంటివన్నీ అందించేవారు. అయితే ఈ ఏడాది జిల్లాలోని 1,376 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 87 వేల మంది విద్యార్థులకు విద్యా సామాగ్రి అందించాల్సి ఉండగా, ఏ పాఠశాలకూ నూరు శాతం పుస్తకాలు, సామాగ్రి అందిన దాఖలాలు లేవు. అంతేకాకుండా, ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా చేరిన విద్యార్థులకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పుస్తకాలు, విద్యా సామాగ్రి అందకపోవడంతో, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్‌ దుకాణాల్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులంతా ఇంటింటికీ తిరిగి, పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే అన్నీ ఉచితంగా అందుతాయని ప్రచారం చేశారు. తీరా ఇప్పుడు ప్రభుత్వం నుంచి పుస్తకాలు, యూనిఫామ్‌ వంటివి సకాలంలో ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులకు ఏం చెప్పాలో తెలియక ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. పుస్తకాలే సక్రమంగా అందించలేని ప్రభుత్వం, ఇక ’తల్లికి వందనం’ పథకంలో ఎటువంటి మెలికలు పెట్టి కోత విధిస్తుందోనని, తమ పిల్లలకు ఆ సొమ్ము అందుతుందో లేదోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

భీమవరం: విద్యకు పెద్దపీట వేస్తామని, ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో తామే మేటి అని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం, ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచినా విద్యార్థులకు నేటికీ పూర్తిస్థాయిలో పుస్తకాలు, విద్యా సామాగ్రి పంపిణీ చేయలేకపోయింది. వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాఠశాలలు తెరిచిన రోజునే విద్యార్థులందరికీ ’జగనన్న విద్యా కానుక’ కిట్లను అందజేయడమే కాకుండా, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్‌ స్కూళ్లకు ధీటుగా అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియం అమలు చేయడం, ’అమ్మఒడి’ పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ప్రతి ఏటా రూ. 15 వేల ఆర్థిక ప్రోత్సాహం అందించడంతో ప్రభుత్వ బడులకు ఆదరణ పెరిగింది. దీంతో భారీగా ఫీజులు చెల్లించి ప్రైవేట్‌ స్కూళ్లలో చదివించే మధ్యతరగతి తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 5,673 మంది విద్యార్థులు ప్రైవేట్‌ పాఠశాలలను వీడి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు.

బడులు తెరిచి నెల దాటినా పూర్తికాని పుస్తకాల పంపిణీ

విద్యార్థులకు తప్పని అవస్థలు

కొత్తగా చేరిన విద్యార్థులకు అందని పుస్తకాలు, యూనిఫాం

కూటమి పాలనపై మండిపడుతున్న తల్లిదండ్రులు

ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది అదనంగా చేరిన విద్యార్థులకు కూడా అందించడానికి వీలుగా ఆయా పాఠశాలలకు పుస్తకాలు, ఇతర విద్యా సామాగ్రి చేరుతున్నాయి. గత ఏడాది విద్యార్థులందరికీ పాఠశాలల ప్రారంభంలోనే పంపిణీ పూర్తి చేయగా, ఈసారి కొత్తగా చేరిన విద్యార్థులకు అందించే కార్యక్రమం చేపట్టాం. పుస్తకాలు, విద్యా సామాగ్రి కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

– పి.శ్యామ్‌సుందర్‌, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్ట్‌ కోఆర్డినేటర్‌, భీమవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement