అంతర్‌ జిల్లా పోటీలకు ఫుట్‌బాల్‌ జట్టు | - | Sakshi
Sakshi News home page

అంతర్‌ జిల్లా పోటీలకు ఫుట్‌బాల్‌ జట్టు

Jul 12 2026 3:41 AM | Updated on Jul 12 2026 3:41 AM

అంతర్‌ జిల్లా పోటీలకు ఫుట్‌బాల్‌ జట్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి వివాహిత అదృశ్యంపై ఫిర్యాదు

భీమవరం: ఆంధ్రప్రదేశ్‌ ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి మూడు రోజులపాటు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగే జూనియర్‌ బాలుర అంతర్‌ జిల్లాల చాంపియన్‌షిప్‌ పోటీల్లో జిల్లా జూనియర్‌ బాలుర జట్టు పాల్గొంటుందని జిల్లా అసోసియేషన్‌ గౌరవ చైర్మన్‌ ఇళ్ల రాధాకృష్ణ శనివారం చెప్పారు. నూతన పశ్చిమగోదావరి జిల్లా ఏర్పాటు తర్వాత మొదటిసారిగా రాష్ట్రస్థాయి ఫుట్‌బాల్‌ పోటీల్లో జట్టు పాల్గొంటున్నట్లు తెలిపారు. పోటీలకు వెళ్లిన క్రీడాకారులకు రాధాకృష్ణ, ఉప అధ్యక్షులు ఎఎస్‌ఎన్‌ రాజు, ఇళ్ల మధుసూదనరావు, కార్యదర్శి వానపల్లి రమేష్‌, గౌరవ అధ్యక్షుడు పాపోలు ఏడుకొండలు శుభాకాంక్షలు తెలిపారు.

భీమవరం: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్‌ చదలవాడ నాగరాణికి అసోసియేషన్‌ ఆధ్వర్యంలో శనివారం వినతిపత్రం అందజేశారు. ఏపీ ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్‌ వుదిసి వెంకట పాండురంగారావు మాట్లాడుతూ పీఆర్‌సీ కమిషన్‌ తక్షణమే వేయాలని, తాత్కాలిక భృతి, ఐఆర్‌, పెండింగ్‌లో ఉన్న డీఏ, సరెండర్‌ లీవ్‌ ఇవ్వడంతోపాటు పలు సమస్యలను పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో కామరాజు, ఎస్‌ఎన్‌వీ సత్యనారాయణ, పేపకాయల కృష్ణ, జేఏసీ సెక్రెటరీ రామచంద్రరావు, యూటీఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు విజయరామరాజు, ఎస్‌టీయూ జిల్లా అధ్యక్షుడు సాయివర్మ, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ చిట్టూరి హరిప్రసాద్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

కై కలూరు: ఓ వివాహిత కనిపించడం లేదని ఆమె తల్లి రూరల్‌ పోలీసు స్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేసింది. కై కలూరు మండలం పందిరిపల్లిగూడెంకు చెందిన బలే కుసుమసాయికి అదే గ్రామానికి చెందిన చినరాజుతో కొన్నేళ్ల క్రితం వివాహమైంది. వీరికి అమ్మాయి(16), అబ్బాయి(15) సంతానం ఉన్నారు. అయితే కొద్ది రోజులుగా కుసుమసాయి కనిపించకపోవడంతో ఆమె తల్లి కర్ణం దుర్గా పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసినట్లు రూరల్‌ ఎస్సై వి.రాంబాబు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement