భీమవరంలో ఎస్‌ఆర్‌ షాపింగ్‌మాల్‌ ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

భీమవరంలో ఎస్‌ఆర్‌ షాపింగ్‌మాల్‌ ప్రారంభం

Jul 11 2026 6:55 AM | Updated on Jul 11 2026 6:55 AM

భీమవరం: పట్టణంలోని ఉండి రోడ్డులో ఎస్‌ఆర్‌ షాపింగ్‌మాల్‌ 16వ బ్రాంచ్‌ను శుక్రవారం సినీ నటి కృతిశెట్టి ప్రారంభించారు. అభిమానులతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. భీమవరం పరిసర ప్రాంతాలంటే తనకెంతో ఇష్టమని, ఇక్కడి ప్రేక్షకుల అభిమానం మరువలేనన్నారు. ఎస్‌ఆర్‌ షాపింగ్‌ మాల్‌లో అద్భుతమైన డిజైన్లు, అన్ని వయసుల వారికి నచ్చే వస్త్రాలు అందుబాటులో ఉంటాయన్నారు. ముందుగా శాసనమండలి చైర్మన్‌ కొయ్యే మోషేన్‌రాజు, కేంద్ర ఉక్కు, భారీపరిశ్రమశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ కొటికలపూడి గోవిందరావు తదితరులు షాపింగ్‌మాల్‌ను సందర్శించి వస్త్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ ఎస్‌.గోపీనాథ్‌రెడ్డి, డైరెక్టర్‌ ప్రసాద్‌రెడ్డి, పర్చేజింగ్‌ డైరెక్టర్‌ కేశవరెడ్డి, పీఈవో ఉదయ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మండలి చైర్మన్‌ మోషేన్‌రాజు, ఎంపీ, ఎమ్మెల్యే, మాట్లాడుతున్న కృతిశెట్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement