విద్యార్థినిపై హెచ్‌ఎం అనుచిత ప్రవర్తన | - | Sakshi
Sakshi News home page

విద్యార్థినిపై హెచ్‌ఎం అనుచిత ప్రవర్తన

Jul 11 2026 6:55 AM | Updated on Jul 11 2026 6:55 AM

విద్యార్థినిపై హెచ్‌ఎం అనుచిత ప్రవర్తన

పాలకోడేరు: మోగల్లు హైస్కూల్‌ ప్రధానోపాధ్యాయుడు మోగంటి వెంకట త్రినాథులు తీరుపై శుక్రవారం విద్యార్థులు ఆందోళనకు దిగారు. 9వ తరగతిలో పాఠాలు బోధిస్తున్న సమయంలో ఒక బాలిక మెడలోని చున్నీని తీసుకుని ఆయన తన మెడలో వేసుకుని చాలా బాగుంది అంటూ కామెంట్‌ చేసినట్లు విద్యార్థులు ఆరోపించారు. దీంతో విద్యార్థులతో పాటు, బాలిక బంధువులు హెచ్‌ఎంను నిలదీయడంతో పాఠశాలలో కాస్త ఉద్రిక్తత నెలకొంది. గ్రామానికి చెందిన పలువురు పెద్దలు వచ్చి సర్దిచెప్పినట్లు సమాచారం. పలువురు విద్యార్థులు డీవైఈవో రమేష్‌కు ఫిర్యాదు చేయడంతో ఆయన స్థానిక ఎంఈవో నాగరాజుతో పాటు కలిసి పాఠశాలకు వచ్చి వివరాలు సేకరించారు. ఉన్నతాధికారులకు నివేదిస్తామని డీవైఈవో తెలిపారు. మూడేళ్లుగా త్రినాథులు ఇక్కడ పనిచేస్తుండగా ఆయన పనితీరుపై గ్రామస్తులు తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయుడిగా బాధ్యతలు చేపట్టినప్పుడు పాఠశాలలో 630 మంది విద్యార్థులు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 285కి పడిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement