కై కలూరు: సాగు నీరు లేక వరి నారు ఎండిపోతున్న వైనంపై రైతుల ఇబ్బందులను వివరిస్తూ ‘తడవని మడి.. అన్నదాత అలజడి’ శీర్షికతో సాక్షిలో శుక్రవారం కథనం వెలువడిన విషయం పాఠకులకు విధితమే. దీనిపై ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్పందించారు. నీటిని శివారు ప్రాంతాలకు విడుదల చేయాలని ఇరిగేషన్ సిబ్బందిని ఆదేశించారు. దీంతో ఇరిగేషన్ డీఈఈ ఎం.శిరిష ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. కై కలూరు నియోజకవర్గానికి నీటిని చేరవేసే పోల్‌రాజ్, క్వాంప్ బెల్ కాల్వలకు ఒక్కోదానికి 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో వరి రైతులు ఊపిరిపిల్చుకున్నారు.


