న్యూస్‌రీల్
శురకవారం శ్రీ 10 శ్రీ జూలై శ్రీ 2026
సాక్షి, భీమవరం: ఎరువుల బ్లాక్ మార్కెట్, జిల్లాల మధ్య అక్రమ రవాణాకు తాడేపల్లిగూడెం కేరాఫ్ అడ్రస్‌గా మారిందా? కొందరు హోల్‌సేల్ డీలర్లు పాత స్టాకును రీప్యాకింగ్ చేసి అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారా? ఇందుకు కూటమి నేతలు, కొందరు ఉద్యోగులు కొమ్ముకాస్తున్నారా? అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.
జిల్లాలో తాడేపల్లిగూడెం ఎరువుల ర్యాక్ పా యింట్‌గా ఉంది. ఫెర్టిలైజర్స్ వ్యాపారంలో దీర్ఘకాలంగా వ్యాపారం అనుభవం ఉన్న డీలర్లు ఇక్కడ ఎందరో ఉన్నారు. జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం 2.21 లక్షలు, రబీ సాగు విస్తీర్ణం 2.3 లక్షల ఎకరాల వరకు ఉంటుంది. తొలకరిలో 17,800 టన్నుల యూరియా, 1,650 టన్నుల డీఏపీ, 32,500 ట న్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరమవుతాయి. దా ళ్వాలో 41,821 టన్నుల యూరియా, 64,992 టన్నుల ఇతర ఎరువులు వినియోగిస్తుంటారు. జిల్లాతో పాటు పరిసర జిల్లాలకు కంపెనీల కేటాయింపుల మేరకు యూరియా, డీఏపీ, ఇతర రకాల ఎరువులు రైల్వే వ్యాగన్లు ద్వారా సరఫరా అవుతుంటాయి. గూడెం నియోజకవర్గంలోని ప్రత్తిపాడు, నవాబుపాలెం, పెదతాడేపల్లి, చినతాడేపల్లి తదితర ప్రాంతాల్లో మార్క్‌ఫెడ్, ప్రైవేట్ డీలర్లకు చెందిన గోదాముల్లో వీటిని నిల్వ చేస్తుంటారు.
రీ ప్యాకింగ్‌తో సొమ్ములు
ఏడాదిన్నర క్రితం ఓ కంపెనీ తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో బ్రాంచులు ఉన్న హోల్‌సేల్ డీలర్‌కు పెద్ద మొత్తంలో ఎరువులను కేటాయించింది. సదరు డీలరు వీటిని రీప్యాకింగ్ చేసి బస్తాకు రూ.30 నుంచి రూ.40 అదనంగా సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇదే తరహాలో మరికొందరు అక్రమాలకు పాల్పడినట్టు అప్పట్లో చర్చ నడిచింది. గతేడాది అధికారుల తనిఖీల్లో పలు గోదాముల్లో స్టాకు వ్యత్యాసాలు గుర్తించినా రాజకీయ ఒత్తిళ్లతో వాటిని కప్పిపుచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి.
కృత్రిమ కొరత సృష్టించి..
కొందరు హోల్‌సేల్ డీలర్లకు పలు జిల్లాల్లో లైసెన్సులు ఉండటంతో కృత్రిమ కొరత సృష్టించి ఒక జిల్లాకు కేటాయించిన ఎరువులను మరో జిల్లాలో అధిక ధరలకు విక్రయిస్తూ రైతులపై భారం మోపుతున్నారంటున్నారు. అధికారులు తనిఖీలకు వచ్చి న సమయంలో కేవలం స్టాకు రికార్డులు మాత్రమే పరిశీలిస్తున్నారని, ఒక జిల్లాకు వచ్చిన సరుకు వాస్తవానికి ఏ జిల్లాలో విక్రయించారు? వే బిల్స్, ఇతర రవాణా పత్రాల ఆధారంగా పూర్తి పరిశీలన చేయకపోవడం వలన అక్రమాలు బయటకు రావడం లేదంటున్నారు. ఇటీవల యూరియా కంపెనీలు ఎమ్మార్పీ ధరను దఫదఫాలుగా రూ.5 నుంచి రూ.30 వరకు పెంచుతూ వచ్చాయి. ఈ క్రమంలో తక్కువ ధరకు వచ్చిన వాటిని రీప్యాకింగ్ చేసి కొత్త ధరకు సరఫరా చేశారని తెలుస్తోంది.
పక్కదారి పట్టిస్తూ..
ప్రస్తుతం రైతులు యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుంటేగాని ఎరువుల కొనుగోలుకు అవకాశం లేదు. ఇదంతా రికార్డ్ ప్రకారం జరుగుతుంది. జిల్లాలో వ్యవసాయం చేసే రైతుల కంటే కౌలు రైతులు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరిలో చాలామందికి కౌలు గుర్తింపు కార్డులు లేవు. ఎరువుల కోసం అసలు రైతు పాస్‌బుక్ జెరాక్సులను ఎరువుల దుకాణాల్లో అందజేసి ఎరువులు పొందుతున్నారు. వీటి ఆధారంగా వ్యాపారులు ఎరువులను దారి మళ్లిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం యూరియా బస్తా అసలు ధర రూ.260 కాగా జి ల్లాలోని పలుచోట్ల రూ.300 నుంచి రూ.320 వరకు పెంచి అమ్మకాలు చేస్తున్నట్టు తెలిసింది.
ఉన్నత స్థాయికి ఫిర్యాదు
ఎరువుల గోదాములపై పూర్తిస్థాయిలో నిఘా కొరవడటంతో డీలర్ల ఇష్టారాజ్యంగా మారిందన్న విమర్శలున్నాయి. గతేడాది యూరియా కొరత ఏర్పడటం, అధిక ధరలకు అమ్మకాలు చేయడం నిదర్శనంగా రైతులు చెబుతున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసే దిశగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలంటున్నారు. గోడౌన్లలో ఉన్న స్టాకును భౌతికంగా తనిఖీలు చేయాలని, వేబిల్స్, రవాణా పత్రాలు, స్టాక్ మూమెంట్, రిటైల్, హోల్‌సేల్ డీలర్ల లావాదేవీలను పూర్తిగా పరిశీలించాలని కోరుతున్నారు. గుంటూరుకు చెందిన ఒక అధికారి అండతో జిల్లాలో ఎరువుల అక్రమాలు జరుగుతున్నాయంటూ కొందరు ఉన్నత స్థాయికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం.
భీమవరం (ప్రకాశంచౌక్): పట్టణంలోని బలుసు మూడి బీసీ కాలనీలోని రామలక్ష్మమ్మనగర్‌లో గురువారం కలెక్టర్ సీహెచ్ నాగరాణి పర్యటించారు. సర్ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీ, డిజిటలైజేషన్ ప్రక్రియ, కాలనీలో పారిశుద్ధ్య పరిస్థితులు, చెత్త సేకరణ తదితర అంశాలపై ప్రజలను ఆరా తీశారు. డిజిటలైజేషన్ ప్రక్రియ వేగిరపర్చేందుకు ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని అసిస్టెంట్ కమిషనర్ రాంబాబును ఆదేశించారు. పారివుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు.
భీమవరం: ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించకుంటే ఉద్యమం తప్పదని, ఉద్యోగులంతా సిద్ధం కావాలని అమరావతి ఏపీ జేఏసీ జిల్లా చైర్మన్ ఐతం సత్యనారాయణ పిలుపునిచ్చా రు. ఉద్యోగుల హక్కుల సాధన కోసం ఉద్యమానికి గురువారం భీమవరంలో సన్నాహక సమావేశం నిర్వహించారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఉద్యోగులు, ఉపా ధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. 12వ పీఆర్సీ కమిషన్‌ను 2023 జూలై నాటికి నియమించాల్సిన ఉన్నా పట్టించుకోవడం లేదని, 30 శాతం తగ్గకుండా మ ధ్యంతర భృతి ప్రకటించి డీఏ బకాయిలు చెల్లించా లని డిమాండ్ చేశారు. ఈహెచ్‌ఎస్ హెల్త్ కార్డులు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదని అన్నారు. సమస్యల పరిష్కారానికి సుదీర్ఘ పోరాటానికై నా వె నుకాడబోమన్నారు. జేఏసీ జనరల్ సె క్రటరీ అల్లం సత్యనారాయణ, ట్రెజరర్ కనకరావు, మహిళా విభాగం జనరల్ సెక్రటరీ బి.అరుణ పాల్గొన్నారు.
ఏపీ జేఏసీ నాయకులు
నిఘా కరువు
ఫెర్టిలైజర్స్ ర్యాక్ పాయింట్‌గా తాడేపల్లిగూడెం
గూడెం, పరిసరాల్లో విస్తరించిన ఎరువుల గోదాములు
గతంలో రీ ప్యాకింగ్, బ్లాక్ మార్కెట్‌తో భారీగా దోపిడీ
కూటమి నేతల కనుసన్నల్లో ఎరువుల దందా
అక్రమాల అడ్డుకట్టకు ఉన్నత స్థాయికి ఫిర్యాదు


