చంద్రబాబు పాలనలో దోచుకోవడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పాలనలో దోచుకోవడమే లక్ష్యం

Jul 10 2026 9:39 AM | Updated on Jul 10 2026 9:39 AM

చంద్రబాబు పాలనలో దోచుకోవడమే లక్ష్యం

మాజీ మంత్రి పేర్ని నాని

భీమవరం: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రజలను దోచుకోవడం మినహా అభివృద్ధి, సంక్షేమం ఎక్కడా కనిపించడం లేదని వైఎస్సార్‌సీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. గురువారం భీమవరంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడా రు. రాష్ట్రంలో ప్రైవేట్‌ విద్యాసంస్థలు రాజ్యమేలుతున్నాయన్నారు. నారాయణ, చైతన్య, భా ష్యం, విజ్ఞాన్‌ వంటి ప్రైవేట్‌ విద్యాసంస్థలన్నీ చంద్రబాబు మనుషులవే అని, ఎన్నికల్లో వీరు ఇచ్చిన నిధులకు బదులుగా, ఇప్పుడు ప్రభుత్వం ఫీజుల రూపంలో ప్రజల రక్తాన్ని పిండటానికి సహకరిస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభు త్వం ఆక్వా రైతులకు అన్యాయం చేస్తోందని నాని ధ్వజమెత్తారు. తీరప్రాంతంలోని ఆక్వా రంగాన్ని చంద్రబాబు అనుచరులైన సీడ్‌, ఫీడ్‌ కంపెనీల యజమానులే శాసిస్తున్నారన్నారు. వారు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి రైతులను దోచుకుంటున్నారని, ఫీడ్‌పై రూ.4 తగ్గించాలని సీఎం చెబితే, కంపెనీలు రూ.2 మాత్రమే తగ్గించినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించా రు. అలాగే ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం వి ఫలమైందన్నారు. చివరి గింజ వరకు కొంటామనే మాట దేవుడెరుగు, మొదటి గింజను కూ డా ప్రభుత్వం సక్రమంగా కొనడం లేదని, మి ల్లుల బాకీలు చెల్లించాలంటే 10 శాతం కమిషన్‌ అడ్వాన్స్‌గా అడుగుతున్నారన్నారు.

15న వైఎస్‌ జగన్‌ రాక

కూటమి ప్రభుత్వ అసమర్థతను, తప్పుడు పరి పాలనను రైతుల తరఫున నిలదీయడానికి ఈ నెల 15న మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి భీమవరం వస్తున్నారని నాని తెలిపా రు. నష్టపోయిన రైతులు, ప్రజలు పెద్ద సంఖ్య లో తరలివచ్చి తమ సమస్యలను జగన్‌కు వివరించాలని పేర్ని నాని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement