భీమవరం: సైబర్ నేరాలపై ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. గురువారం భీమవరం యాక్సిస్ బ్యాంక్ ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అప్రమత్తత నినాదంతో నిర్వహించిన వాకథాన్ ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఎస్‌ఆర్‌కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల నుంచి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్యాంకు ఖాతాల నుంచి నగదు అపహరించేందుకు సైబర్ నేరగాళ్లు కొత్త కొత్త మార్గాలను అన్వేషిస్తున్నారన్నారు. జేసీ టి.రాహుల్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ సైబర్ మోసాలకు గురైతే 1930 నంబర్‌కు ఫోన్ చేయాలన్నారు. యా క్సిస్ బ్యాంక్ రాజమండ్రి క్లస్టర్ హెడ్ సీహెచ్ శ్రీనివాసరావు, ఏరియా శాలరీ హెడ్ ఎంవీఎస్‌ఎన్ కిషోర్, మార్కెటింగ్ హెడ్ బి.ఉదయ్, ఆర్డీఓ ప్రవీణ్‌కుమార్ రెడ్డి, డీఎస్పీ రఘువీర్ విష్ణు, కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ ఎస్‌ఆర్‌కే నిశాంత్‌వర్మ తదితరులు పాల్గొన్నారు.
భీమవరం (ప్రకాశంచౌక్): పట్టణంలోని ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోడౌన్‌లో భద్రపరిచిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు (ఈవీఎంలు)ను గురువారం కలెక్టర్ నాగరాణి తనిఖీ చేశారు. గోడౌన్ వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. డీఆర్వో పి.ప్రభాకర్ ఉన్నారు.
జీఎస్టీ వసూళ్లు వేగిరపర్చాలి
జిల్లాలో జీఎస్టీ వసూళ్లను వేగిరపర్చాలని కలెక్టర్ నాగరాణి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ లో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి జీఎస్టీ వసూళ్లపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాల్లో పరిశ్రమల వద్ద పెండింగ్‌లో ఉన్న జీఎస్టీని వసూలు చేయడానికి చర్యలు తీసుకోవాలని, కేసులు న మోదు చేయాలని ఆదేశించారు.


