భీమవరం: భీమవరంలో నూతనంగా ఏర్పాటుచేసిన ఎస్‌ఆర్ షాపింగ్‌మాల్‌ను శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సినీ నటి కృతి శెట్టి (ఉప్పెన ఫేం) ప్రారంభించనున్నట్లు షాపింగ్ మాల్ డైరెక్టర్ ప్రసాద్‌రెడ్డి గురువారం తెలిపారు. రాష్ట్రంలో 16వ బ్రాంచ్‌ను పట్టణంలోని ఉండి రోడ్డులోని బొంబే స్వీట్స్‌షాపు ఎదురుగా ఏర్పాటుచేసినట్టు చెప్పారు. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు నాణ్యమైన వస్త్రాలను అందుబాటు ధరల్లో అందిస్తామన్నారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఫ్యామిలీ మొత్తానికి అన్ని ఆఫర్లను అందిస్తున్నామన్నారు. డైరెక్టర్ కేశవరెడ్డి మాట్లాడుతూ సినీనటి కృతిశెట్టితోపాటు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు, మండలి చైర్మన్ కొయ్యే మోషేన్‌రాజు, ఎంపీ పాక వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.


