ఆలోచింపజేసిన నాటికలు
ఏలూరులో నిర్వహిస్తున్న జాతీయస్థాయి నాటిక పోటీలు సోమవారం మూడో రోజుకు చేరుకున్నాయి. 3వ రోజు ప్రదర్శించిన నాటికలు ఆకట్టుకున్నాయి. 8లో u
కలెక్టర్ నాగరాణి
సాక్షి, భీమవరం: ఓటరు ముసాయిదా జాబితా తుది జాబితాను తలపించే విధంగా తప్పులు లేకుండా తయారుచేయాలన్న లక్ష్యంతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్)ను జిల్లాలో పారదర్శకంగా నిర్వహిస్తున్నామని కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. కలెక్టరేట్‌లోని చాంబర్‌లో సోమవారం ప్రింట్ మీడియాతో కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 14.75 లక్షల మంది ఓటర్లకు గాను ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ 99.82 శాతం పూర్తయ్యిందన్నారు. 9,10,507 ఓట్లను డిజిటలైజ్ చేశామన్నారు. అర్బన్ ఏరియాలు, డిజిటలైజ్ ఆలస్యమవుతున్న చోట ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. ప్రతి మండలానికి ప్రత్యేకాధికారులను నియమించి పర్యవేక్షిస్తున్నామన్నారు. విదేశాల్లో ఉన్న వారు ఆన్‌లైన్ ద్వారా మ్యాపింగ్ చేసుకునే వెసులుబాటు ఉందన్నారు. ఈనెల 14 వరకు బీఎల్‌ఓల ఇంటింట సందర్శనకు గడువుందని, 9వ తేదీ నాటికి నూరుశాతం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. షెడ్యూల్ ప్రకారం 21న ముసాయిదా జాబితా ప్రదర్శించి, 21 నుంచి ఆగస్టు 20 వరకు అభ్యంతరాల స్వీకరణ, ఆగస్టు 21 నుంచి సెప్టెంబరు 18 వరకు క్లెయిమ్స్ పరిష్కరించి 22న తుదిజాబితాను ప్రచురించనున్నట్టు కలెక్టర్ నాగరాణి వివరించారు.
భీమవరం: గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం అర్హులైన ఉపాధ్యాయులు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.


