భీమవరం: ఆశ వర్కర్స్‌కు ప్రభుత్వమిచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టరేట్ వద్ద ఈ నెల 31న ధర్నాలు నిర్వహిస్తున్నట్లు ఆశ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి సీహెచ్ లక్ష్మి చెప్పారు. సోమవారం యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో డీఎంహెచ్‌వో కార్యాలయంలో వినతిపత్రం అందచేసిన అనంతరం మాట్లాడుతూ తమకు సంబంధం లేని పనిని బలవంతంగా చేయిస్తున్నారని, ఆన్‌లైన్ సేవల పేరుతో పని భారాన్ని పెంచేశారని ఆందోళన వ్యక్తం చేశారు. పని ఒత్తిడి కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నామని తక్షణమే సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ధర్నా నిర్వహిస్తున్నామన్నారు.


