ఏలూరు (టూటౌన్): ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల చివరి రోజు రాష్ట్ర అధ్యక్షుడిగా వి.కృష్ణయ్య, కార్యదర్శి గా కె.ప్రభాకరెడ్డి, కోశాధికారిగా మర్రాపు సూర్యనారాయణ, ఉపాధ్యక్షులుగా వై.కేశవరావు, జొన్నా శివశంకరరావు, పీవీ ఆంజనేయులు, మూలి వెంగయ్య, పి.హేమలత, ఆర్ చంద్రశేఖర్ రెడ్డి, గౌరుశెట్టి నాగేశ్వరరావు, ఆకుల హరేరామ్, వల్లూరు భారతి, సహాయ కార్యదర్శులుగా ఏ.హరి, జి.రామకృష్ణ, టి.రామచంద్రుడు, జె.జయంతి బాబు, కంచుమాటి అజయ్ కుమార్, కె.శ్రీనివాస్, ఎం.అప్పలరాజు, బుద్ధరాజు రాంబాబుతో పాటు మరో 46 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
తణుకు అర్బన్: మోడ్రన్ పెంటాథ్లాన్ లేజర్ రన్ జిల్లా జట్ల ఎంపికలు ఆదివారం తణుకు శ్రీ చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. అండర్ 9, 11, 15,17, 19 కేటగిరీలకు సంబంధించి జిల్లా నలుమూలల నుంచి 100 మంది క్రీడాకారులు హాజరుకాగా అత్యుత్తమ ప్రతిభ చూపించిన 32 మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సంకు విరాటలక్ష్మి తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 11, 12 తేదీల్లో ఏలూరులో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఎంపికలను వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్.సూర్యనారాయణ, కె.బాబూరావు, కె.సుబ్బారావు, ఎ.నాగేశ్వరరావు, ఆర్.నాయక్‌లు పర్యవేక్షించారు.


